ఈ మధ్యకాలంలో సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలను ఓటీటీల్లోనే ఎక్కువగా చూస్తున్నారు.
మూవీలను, వెబ్ సిరీస్ లను, టీవీ షోలను పలు ఓటీటీ సంస్థలు అందిస్తున్నాయి.
అయితే అన్నిటినీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే బిల్లు ఎక్కువవుతుంది.
తాజాగా కొన్ని సంస్థల మాదిరిగి బీఎస్ఎన్ఎల్ కూడా సింగిల్ ప్లాన్ తో పలు ఓటీటీ యాప్స్ ని అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ ప్రముఖ ఓటీటీ యాప్స్ ని ఒకే ఒక వేదిక మీదకు తీసుకొచ్చింది.
బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ పేరుతో ఓటీటీ యాప్స్ ని సింగిల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీద అందుబాటులోకి తీసుకొచ్చింది.
వివిధ ఓటీటీ కంటెంట్ల కాంబినేషన్ తో మూడు రకాల ప్యాక్స్ ను ఆఫర్ చేస్తోంది.
ఫైబర్ కనెక్షన్ తో రిజిస్టరైన మొబైల్ నంబర్ మీద ఈ ఓటీటీ ప్యాక్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇక ఈ సబ్క్ర్సిప్షన్ ఫీజును ఫైబర్ నెట్ బిల్లులో ఛార్జ్ చేయబడుతుంది.
ఇందులో స్టార్టర్ ప్యాక్, ఫుల్ ప్యాక్, ప్రీమియం ప్యాక్ అని మూడు రకాల ప్యాక్స్ ఉన్నాయి.
రూ. 49కే రానున్న స్టార్టర్ ప్యాక్ లో టీవీ షోలు కలిగిన లయన్స్ గేట్, హంగామా, షెమారూ, ఎపికాన్ ఓటీటీ యాప్స్ వస్తాయి.
అలానే రూ. 199 ప్యాక్ లో జీ5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, డిస్నీ+హాట్ స్టార్, యప్ టీవీ యాప్స్ ని పొందవచ్చు.
రూ. 249 ప్రీమియం ప్యాక్ కింద జీ5 ప్రీమియం, హంగామా, లయన్స్ గేట్, హాట్ స్టార్ వంటి ఓటీటీలను పొందవచ్చు.
రూ. 999 ప్లాన్ తో 150 ఎంబీపీఎస్ హైస్పీడ్ ఇంటర్నెట్ తో పాటు 300+ లైవ్ టీవీ ఛానల్స్ చూడవచ్చు.
అలానే 500+ టీవీ సిరీస్, 100+ ఒరిజినల్ టీవీ షోస్, 8000+ సినిమాలను చూడవచ్చు.
300+ లైవ్ టీవీ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, కిడ్స్ ఛానల్స్ వస్తాయి.
యాడ్ ఆన్ ప్యాక్స్ కింద యప్ టీవీ స్కోప్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్, యప్ టీవీ స్కోప్ సౌత్ ప్యాక్ లను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు