తెలుగువారికి ఉగాది నుంచే కొత్త ఏడాది మొదలవుతుంది.
ఇలాంటి పండుగ పూట ఇంట్లో కొత్త వస్తువులు తెచ్చుకోవాలని పండితులు చెబుతున్నారు.
కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేసి తెచ్చుకుంటే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందట. అదృష్టాన్ని తెచ్చే ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం..
వాస్తుశాస్త్రంలో కొబ్బరికి మంచి ప్రాధాన్యత ఇస్తారు. కొబ్బరిని లక్ష్మీకి ప్రతీకగా చూస్తారు.
చిన్న ఎండు కొబ్బరిని తీసుకుని దానికి పూజ చేసి.. ధనాన్ని దాచే చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం దొరుకుతుందని పండితులు సూచిస్తున్నారు.
తులసి మొక్కను మన దేశంలో పవిత్రమైనదిగా భావిస్తారు.
ఔషధ గుణాలు కలిగిన తులసి ఇంట్లో ఉంటే సుఖశాంతులతో పాటు సిరిసంపదలు కూడా కలుగుతాయని ప్రతీతి.
తులసి మొక్క ఉండే ఇంటిని తీర్థ స్వరూపం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
తులసి మొక్కను వాకిట్లో పెడితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లేనని పండితులు చెబుతున్నారు.
తాబేలు ప్రతిమ అనేది సుఖశాంతులకు ప్రతీక అని వాస్తు శాస్త్రం చెబుతోంది.
తాబేలును ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మీ నడిచొస్తుందట.
తాబేలు ప్రతిమ ఇంట్లో పెట్టుకుంటే ఆలస్యమవుతున్న పనులు కూడా ఎంతో వేగంగా పూర్తవుతాయట.
ఇత్తడి, వెండి తాబేలును ఇళ్లల్లో పెట్టుకోవచ్చని పండితులు అంటున్నారు.
ముత్యపు చిప్పను ఇంట్లోకి తెచ్చుకుంటే డబ్బులకు లోటు ఉండదట. దీన్ని పూజ చేసిన తర్వాతే డబ్బులు దాచే ప్రదేశంలో ఉంచాలని పండితులు సలహా ఇస్తున్నారు.
కృష్ణుడికి ఇష్టమైన నెమలి పింఛాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు సూచిస్తున్నారు.