పాలిచ్చే తల్లులు తినే ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎందుకంటే.. తల్లి తీసుకునే ఆహారం పాల ద్వారా బిడ్డకు కూడా చేరుతుంది కనుక. 

అందుకే పాలిచ్చే తల్లులకు ఏ ఆహారాలు తీసుకోవాలి.. ఏవి తికూడదు అనే విషయంలో అవగాహన ఉండాలి.

మరీ ముఖ్యంగా కడుపులో గ్యాస్‌ని ఉత్పత్తి చేసే ఆహారాలు అసలు తీసుకోకూడదు. 

పాలిచ్చే తల్లులు టీ, కాఫీలను తాగకపోవడమే మంచిది అంటున్నారు వైద్యులు.

ఎందుకంటే.. వీటిలో ఉండే కెఫిన్‌ బిడ్డను ఎక్కువ సేపు నిద్రలో ఉంచుతుంది. 

అలానే పాలిచ్చే తల్లులు కొన్ని రకాల చేపలను తినకూడదు. వీటిల్లో పాదరసం ఉంటుంది. ఇది బిడ్డ మెదడుకు హానీ చేస్తుంది.

అలానే ప్రాసెస్‌ చేసిన ఆహారా పదార్థాలను కూడా తీసుకోకూడదు. వీటిలో కోలిక్‌ వంటి ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలుంటాయి. ఇవి చిన్నారికి అలర్జీ కలిగిస్తాయి.

బాగా కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. స్పైసీ ఆహారం తీసుకుంటే.. బిడ్డకు జీర్ణ సమస్యలు, అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

గర్భంతో ఉన్నప్పుడు, పాలిచ్చే వారు ఆల్కహాల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది. 

ఇది బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

అలానే పాలిచ్చే తల్లులు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే పిల్లల్లో నిద్రలేమి సమస్య తలెత్తుతుంది.