మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా ఆగినా, మెదడులో రక్తనాళం పగిలినా, రక్తనాళం పూడుకుపోయిన బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది.

ఈ కారణంగా పక్షవాతం వస్తుంది. శరీరంలో సగభాగం చచ్చుబడిపోయి మెదడు దెబ్బ తింటుంది. కొన్ని సార్లు అది మరణానికి కూడా దారి తీస్తుంది.

అయితే స్ట్రోక్ కి గురైన గంటలో ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

అయితే బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం ఎలా అని మీకు సందేహం రావచ్చు.

బ్రెయిన్ స్ట్రోక్ సంభవించినప్పుడు ముఖం వేలాడి పోతుంది. స్ట్రోక్ కు గురైన వ్యక్తి నవ్వలేరు.

కన్ను, నోరు వంగిపోతాయి. మాట్లాడలేరు. దృష్టి లోపం వస్తుంది.

కంటి చూపులో ఇబ్బందులు వస్తాయి. మాట అర్థం చేసుకోవడం ఇబ్బంది పడతారు.

చేయి బలహీనంగా మారుతుంది. ఈ కారణంగా చేయి పైకి లేపలేరు. శరీరం సమతుల్యత కోల్పోతుంది.

స్ట్రోక్ వస్తే తిమ్మిరి, ఒళ్ళు జలదరింపు, చలనం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, అస్థిరమైన నడక, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనబడతాయి.

ఈ సంకేతాలు కనబడిన వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడిన గంటలోపు ఆసుపత్రికి తీసుకెళ్లగలిగితే ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదని వైద్యులు చెబుతున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.