క్రికెట్ అంటే చాలా మంది ఇష్టపడతారు. చూడడం కంటే కూడా ఆడేందుకు ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు.

పల్లెటూర్లలో అయితే పొలాలే గ్రౌండ్లు. ఇక చిన్న టౌన్స్ లో అయితే ఏ గోదారి గట్టునో, పాఠశాల ప్రాంగణాన్నో, పాఠశాల గదులనో గ్రౌండ్ గా మలచుకుని ఆడుకుంటారు.   

అయితే పెద్ద పెద్ద నగరాల్లో గ్రౌండ్ దొరకడం అనేది చాలా కష్టం. ఇలాంటి సమయంలో బాక్స్ క్రికెట్ అనేది గ్రౌండ్ లేని లోటుని పూడుస్తుంది.

ఈ బాక్స్ క్రికెట్ కి మంచి డిమాండ్ ఉంది. దీన్ని బిజినెస్ గా మలచుకుంటే మంచి ఆదాయం వస్తుంది. 

దీని కోసం ఒక ఖాళీ ప్రదేశం ఉండాలి. అది రూఫ్ టాప్ లో అయినా పర్లేదు. చుట్టూ పోల్స్ ఏర్పాటు చేసుకుని.. కాంక్రీట్ ఫ్లోరింగ్, సింథటిక్ గ్రాస్ తో బాక్స్ లా ఒక సెటప్ ని నిర్మించాలి.

ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ కి స్థలాన్ని బట్టి పెట్టుబడిలో మార్పు ఉంటుంది. 

ఎంపిక చేసుకునే స్థలాన్ని బట్టి రూ. 12 నుంచి రూ. 15 లక్షల వరకూ ఖర్చవుతుంది.   

ఒకసారి పెట్టుబడి పెడితే చాలు. లైఫ్ లాంగ్ రెంట్ కి కాసేపు బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ని అద్దెకు ఇవ్వచ్చు. గంటకు ఇంత అని చెప్పి వసూలు చేయవచ్చు.  

కాలేజీలు, కార్పొరేట్ ఆఫీసులు, స్కూళ్ళు వంటి వాటి దగ్గర పబ్లిసిటీ చేసుకుంటే ఆడేందుకు వస్తారు. 

ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో వంటి వాటిలో ప్రకటనలు ఇస్తే  అందరికీ తెలుస్తుంది. 

ఈ మధ్య కార్పొరేట్ ఉద్యోగులు ఈ బాక్స్ క్రికెట్ ఆడేందుకు మక్కువ చూపిస్తున్నారు.

క్రికెట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లా కూడా ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ని వాడుకోవచ్చు. చిన్న పిల్లలకు, ఆసక్తి ఉన్న వారికి కోచింగ్ ఇవ్వచ్చు.

పగలు మాత్రమే కాకుండా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తే రాత్రి పూట కూడా ఆడే సదుపాయం కల్పిస్తే చాలా మంది వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు.

ఇక సెలవు దినాల్లో టోర్నమెంట్ లు నిర్వహించడం, ప్రైజ్ మనీ ఇవ్వడం లాంటివి చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎంట్రీ ఫీజు ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.