ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు
నటీనటులు కొత్తవాళ్ళైనా, పాతవాళ్ళైనా సినిమాలో కంటెంట్ ఏంటనేది ముఖ్యమని భావిస్తున్నారు ప్రేక్షకులు
తాజాగా యాక్టర్ నందు, యాంకర్ రష్మీగౌతమ్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయిన యంగ్ డైరెక్టర్ రాజ్ విరాట్ ఈ సినిమాకు దర్శకుడు.
ఇప్పటికే పాటలు, ట్రైలర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
పోతురాజు(నందు) డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి వీరాభిమాని. ఓ కథ రాసుకొని ఎలాగైనా పూరి జగన్నాథ్ కి వినిపించి సినిమా తీయాలని లక్ష్యం పెట్టుకుంటాడు.
వాణి(రష్మీ గౌతమ్)తో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే.. పోతురాజుకి తన ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. దీంతో పోతురాజు లైఫ్ ఊహించని మలుపులు తిరుగుతుంది
అప్పటినుండి పోతురాజు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు? అసలు తన ఫ్యామిలీ గురించి ఏం తెలిసింది? వాణితో లవ్ స్టోరీ ఏమైంది? అనేది మిగిలిన కథ
ఎక్కువగా యాక్షన్ జానర్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో, ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీని కూడా అదే జానర్ లో చేశాడు దర్శకుడు
పోతురాజు క్యారెక్టర్ ఇంట్రడక్షన్.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.. సినిమా పిచ్చి.. లైఫ్ గోల్ ని పరిచయం చేస్తూ సినిమా మొదలైంది
పూరి జగన్నాథ్ కి వీరాభిమానిగా.. పోతురాజు ఓ కథ రెడీ చేసుకొని ఎలాగైనా పూరీని కలిసి కథ చెప్పాలనుకొని.. రఫ్ అండ్ టఫ్ గా బ్రతికేస్తుంటాడు
అలా కథలోకి వాణి(రష్మీ గౌతమ్) ఎంటర్ అవుతుంది. పోతురాజు ఆమెతో ప్రేమలో పడటం.. ఆమెను లవ్ పడేయడానికి నచ్చిన పనులు చేయడం ఇంటరెస్టింగ్ గా ఉంటాయి.
ఇక సెకండాఫ్ లో పోతురాజు లైఫ్, మూవీ కథ ఊపందుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో నుండి మాస్ యాంగిల్ తో పాటు ఎమోషనల్ సైడ్ కూడా చూపించాడు దర్శకుడు
స్క్రీన్ ప్లే స్లో అయినా.. టేకింగ్ పరంగా డైరెక్టర్ రాజ్ విరాట్ ఆకట్టుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ నుండి సినిమాకి వచ్చేసరికి రాజ్ విరాట్.. అక్కడక్కడా తడబడ్డ విషయం ఈజీగా అర్థమవుతుంది
సింపుల్ లైన్ తో బ్లాక్ బస్టర్ వైపు గట్టిగానే ప్రయత్నించారు. కానీ.. టైటిల్ లో ఉన్న పవర్ స్టోరీలో లేదనే చెప్పుకోవచ్చు. ప్రశాంత్ విహారి పాటలు ఓకే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
ప్లస్ లు: నందు, రష్మీ గౌతమ్ స్టోరీ లైన్ మ్యూజిక్ ట్విస్టులు