ఓపీ నయ్యర్‌ ఆసియా యొక్క రిథమ్ కింగ్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.  తాగుడుకి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు.

అచల సచ్‌దేవ్‌ భర్తను వదిలేసి ఒంటరిగా బతికారు. కిచెన్‌లో జారిపడి మృతి చెందారు. ఈమె చనిపోయినప్పుడు పిల్లలు పట్టించుకోలేదు.

1970, 80ల్లో బాలీవుడ్‌ని షేక్‌ చేసిన పర్వీన్ బాబి తీవ్ర డిప్రెషన్‌కి గురయ్యారు. ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఉన్నట్టుండి ముంబైలోని ఫ్లాట్‌లో మృతి చెందారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కమల్ అమ్రోహి నుండి విడిపోయాక మద్యానికి బానిస అయ్యారు మీనా కుమారి. లివర్ పూర్తిగా దెబ్బతినడంతో 38 ఏళ్లకే మృతి చెందారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రిషి కపూర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన రాజ్‌ కిరణ్ అనే బాలీవుడ్‌ నటుడు అట్లాంటలో మతి స్థిమితం లేని స్థితిలో పడున్నారు.

భోజ్‌పురి నటి మిథాలి శర్మ సడన్‌గా అవకాశాలు రాకపోవడంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. తర్వాత ముంబై వీధుల్లో బెగ్గర్‌గా మారాల్సి వచ్చింది. 

ఖరీదైన కార్లకి, లగ్జరీ బంగ్లాలకి పెట్టింది పేరు భగవాన్‌ దాదా. అంత రిచ్‌గా బతికిన ఈ బాలీవుడ్ నటుడు చివరకి సాధారణ కూలీలు ఉండే ముంబై స్లమ్‌లో మరణించే పరిస్థితి వచ్చింది. 

భరత్ భూషణ్‌ తప్పల్లా మీనా కుమారిని ప్రేమించడమే. ఆమె చెడు అలవాట్లను భరిస్తూ వచ్చారు. చివరికి సినిమాలు మానేసి ఫిల్మ్‌ స్టూడియో దగ్గర గేట్‌ కీపర్‌గా పనిచేశారు. అపార్ట్‌మెంట్‌లో మృతి చెందారు.

డ్రగ్స్‌కి, మద్యానికి బానిస అవ్వడం వల్ల గీతాంజలి నాగ్‌పాల్‌ ర్యాంప్‌ మీద ఉండాల్సిన ఆమె జీవితం రోడ్డు మీదకొచ్చేసింది. 

సౌత్‌ ఢిల్లీ వీధుల్లో ముష్టి ఎత్తుకోవడం మొదలుపెట్టారు. పనిమనిషిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె మానసిక చికిత్స పొందుతున్నారు.

సుమంత్ నటించిన ప్రేమ కథ సినిమా హీరోయిన్‌ అంతర మాలి తండ్రి జగదీశ్ మాలి.

ముంబై అంధేరి వీధుల్లో హాఫ్‌ నేకెడ్‌గా భిక్షాటన చేస్తూ సల్మాన్ ఖాన్ కంట పడ్డారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ అతనికి సహాయం చేశారు.

 అయితే 15 ఏళ్ళుగా డయబెటిస్‌, అధిక రక్తపోటు, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జగదీశ్‌ 59 ఏళ్ళ వయసులో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.