ప్రస్తుతమున్న హీరోయిన్లలో మీ ఫేవరెట్ ఎవరంటే.. మనలో చాలామంది రష్మిక పేరు చెబుతారు.

ఎందుకంటే 'పుష్ప'తో ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ఈమె.. సౌత్ తో పాటు హిందీలోనూ బిజీగా మారిపోయింది.

ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అలాంటి ఈమె పేరు చెప్పి కొందరు మోసానికి పాల్పడ్డారు.

అవును మీరు విన్నది నిజమే. సినిమా అవకాశాల కోసం చాలామంది పడిగాపులు కాస్తుంటారు. వాళ్లని మోసం చేసేవాళ్లు కూడా ఉంటారు.

ఇండస్ట్రీలోకి రోజూ ఎంతోమంది వస్తుంటారు. ఒకే ఒక్క అవకాశమొస్తే స్టార్ అయిపోవచ్చని కలలు కంటూ ఉంటారు.

అలాంటి వాళ్లని బాలీవుడ్ నటులు అపూర్ అశ్విన్, నటాషా కపూర్ టార్గెట్ చేశారు. హైదరాబాద్ లో ఈ ఇద్దరూ కలిసి పలువురిని మోసం చేశారు.

ఓ రెండు మూడు హిందీ సినిమాల్లో నటించిన ఈ ఇద్దరూ.. కాస్మోపాలిటన్ పేరుతో ఓ వెబ్ సైట్ ని రన్ చేస్తున్నారు.

చిన్నపిల్లలకు మోడలింగ్ లో ట్రైనింగ్ ఇచ్చి, సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని చెబుతూ వచ్చారు. అలా ఓ వ్యాపారవేత్తని బురిడి కొట్టించారు.

తన ఇద్దరు పిల్లలకు మోడలింగ్ లో ట్రైనింగ్ ఇస్తానని అశ్విన్, నటాషా చెప్పడంతో సదరు వ్యాపారవేత్త.. రూ.20 లక్షలు ఇచ్చాడు.

రోజుల గడిచినా సరే సదరు అశ్విన్, నటాషా దగ్గర నుంచి ఎలాంటి కబురు లేకపోవడంతో వ్యాపారవేత్తకు విషయం అర్థమైంది.

తాను మోసపోయానని గ్రహించిన సదరు వ్యాపారవేత్త.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలోనే సదరు ఇద్దరు బాలీవుడ్ నటుల్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

అయితే ఈ ఇద్దరికీ హీరోయిన్ రష్మిక పేరు ఎందుకు ఉపయోగించారు? వాళ్లకు ఆమెతో పరిచయం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నప్పటికీ.. ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన మోసం కూడా అలాంటిదే. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే మీతో డబ్బులు విషయం మాట్లాడినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.