రామ్ గోపాల్ వర్మ..కాంట్రవర్సీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ ఫ్యాన్స్ ఇంకా ఆయన్ను గొప్ప డైరెక్టర్‌గానే కొలుస్తున్నారు.
సరైన సినిమా తీస్తే చూసే వాళ్లెందరో. కానీ ఎందుకో సినిమా న్యూస్‌ల కన్నా వ్యక్తిగత విషయాల ద్వారానే అందరి నోళ్లలో నానుతూ ఉంటారు.
అరియానా, అషూ రెడ్డి లాంటి యాంకరమ్మలతో రొమాన్స్‌తో కూడిన ఇంటర్వ్యూలు ఇచ్చి.. మహిళలతో తిట్లు తింటుంటారు.
అయితే ఈ దర్శకుడు ఓ బాలీవుడ్ నటుడిని మోసం చేశారంట.. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..?
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయి తెలియని వారుండరు. ఫ్యామిలీ మెన్ సిరీస్‌తో ప్రతి ఒక్కరికి ఆయన సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి స్టార్ హీరోగా ఎదిగాడు.
తెలుగులో కూడా పలు సినిమాలు చేశారు. ప్రేమకథ, హ్యాపీలో పోలీసు ఆఫీసరుగా, వేదం సినిమాలో కనిపించారు.
తొలుత చిన్న చిన్న సినిమాలు చేసినా ఆయనకు బ్రేక్ ఇచ్చింది మాత్రం ఆర్జీవీ మూవీ సత్య అనే చెప్పాలి. అందులో ఆయన నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు
ఇప్పుడు సిరీస్, సినిమాలతో ఫుల్ బిజీగా మనోజ్ బాజ్ పేయి.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆర్జీవి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
దౌడ్ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం నటుడిని వెతుకుతున్నారని తెలిసి.. తొలిసారిగా ఆర్జీవీని కలిశాను. అప్పుడు నేను బండిట్ క్వీన్ సినిమాలో మాన్ సింగ్ పాత్ర చేశానని చెప్పాను.
ఇన్నాళ్లు నీ గురించే వెతుకుతున్నాను, ఆ సినిమా చాలా సార్లు చూశాను, ఆ పాత్ర చాలా నచ్చింది.
నీకు దౌడ్ సినిమాలో ఛాన్స్ వద్దు. తరువాత సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశాను. అందులో మెయిన్ లీడ్ రోల్ నీకేనని హామీనిచ్చాడు.
ఆ తర్వాత సత్య సినిమా కోసం నాకు కాల్ వచ్చింది. మళ్ళీ వెళ్లి ఆర్జీవిని కలిశాను. కానీ అందులో మెయిన్ రోల్ కోసం కాకుండా రెండో పాత్ర కోసం నన్ను తీసుకుంటున్నాని చెప్తే నేను చాలా బాధపడ్డాను
తనను మెయిన్ లీడ్ అన్నారు కదా అని అడిగితే, భికూ మాత్రే పాత్ర గురించి నాకు చెప్పి ఓకే చెప్పేలా చేశారని తెలిపారు.
లీడ్ క్యారెక్టర్ లో ఎవరైనా చేయగలరు, కానీ భికూ మాత్రే మీకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నారు.
అప్పుడు మొదట బాధపడ్డా, సినిమా రిలీజ్ అయ్యాక భికూ మాత్రే పాత్రకు వచ్చిన స్పందన చూసి సంతోషం వేసింది అని తెలిపారు.