టెక్‌ ప్రపంచంలో భారతీయుల హవా             గూగుల్ కి CEO సుందర్ పిచాయ్,  కిమైక్రోసాఫ్ట్ కి  CEO సత్యనాదెళ్ల.. ఇప్పుడు            ట్విట్టర్ కి CEO పరాగ్ అగర్వాల్!

  జాక్ డోర్సీ, ఇవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్,              నోహ్ గ్లాస్ అనే నలుగురు వ్యక్తులు   ఫౌండర్స్ గా, 2006 మార్చ్ 21న శాన్ఫ్రా న్సిస్కో            వేదికగా ట్విట్టర్ ప్రాంభమైంది.

     జాక్ డోర్సీ ఇప్పుడు సీఈఓ పదవికి  రాజీనామా చేయడంతో పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓ గా నియమితులయ్యారు.

   ట్విట్టర్ ఇంత ప్రస్థానం సాగించడంలో             మాజీ సీఈఓ జాక్ డోర్సీ పాత్ర వెల  కట్టలేనిది. కానీ.., పరాగ్ అగర్వాల్ ఏదో రాత్రికి           రాత్రి సీఈఓ కుర్చీలో కూర్చోలేదు.

  పరాగ్ అగర్వాల్ 2011 నుండి ట్విట్టర్ లో                 వివిధ విభాగాల్లో పని చేస్తూ,                ఇప్పుడు సీఈఓ అయ్యారు.

         పరాగ్ అగర్వాల్ 1983లో ముంబైలో            జన్మించారు. ఈయన 2005లో బాంబే  ఐఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌                          డిగ్రీ పూర్తి చేశారు.

    పరాగ్ 2011లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో      ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ నుండి  పీహెచ్‌డీ      పూర్తి చేశారు. పరాగ్ ఈ  సమయంలోనే            మైక్రోసాఫ్ట్‌, ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌,               యాహూలలో రీసెర్చి చేశారు.

         పరాగ్ అగర్వాల్ 2011 లో  ట్విట్టర్ లో       ఓ సాధారణ ఇంజినీర్ గా జాయిన్ అయ్యారు.      2018లో ట్విటర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ గా         పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు.

   పరాగ్ అగర్వాల్ తరువాత కాలంలో ట్విటర్‌             టెక్నికల్‌ స్ట్రేటజీ, మెషిన్‌ లెర్నింగ్‌, .       ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో                బాధ్యతలు చూసుకుంటూ అన్నీ                   విషయాల్లో రాటుదేలాడు.

      కంపెనీ కోసం ఇంత కష్టపడ్డాడు కాబట్టే              ట్విట్టర్ సీఈఓ పోస్ట్ ఇప్పుడు పరాగ్        అగర్వాల్ ని వెతుక్కుంటూ వచ్చింది. 

      ఇక పరాగ్ అగర్వాల్ వ్యక్తిగత విషయానికి           వస్తే.. అగర్వాల్ శాన్  ఫ్రాన్సిస్కోలో ఉన్న       సమయంలోనే  వినీత అనే అమ్మాయిని     ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆన్స్                   అనే కొడుకు జన్మించాడు.

           పీపుల్ ఏఐ తెలిపేదాని ప్రకారం..        పరాగ్ అగర్వాల్ ఆస్తి 1.52 మిలియన్        డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో         చెప్పాలంటే దీని విలువ 11,41,49,720                              రూపాయలు.

       రానున్న ఐదేళ్ల కాలంలో ఈయన ఆస్తి                  ఘననీయంగా పెరగనుంది.

           ట్విట్టర్ సీఈఓ గా పరాగ్ అగర్వాల్       సంవత్సరానికి 7,51,13,500.00 రూపాయలు        జీతంగా అందుకోనున్నారు. వీటికి కంపెనీ         చెల్లించే బోనస్ లు, షేర్స్ అదనం.