పటాస్ లాంటి మాస్ హిట్ తర్వాత  కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఆ స్థాయి బ్లాక్  బస్టర్ పడలేదు. మధ్యలో చాలా  సినిమాలు బాగున్నాయని అనిపించినా. కమర్షియల్ గా నిరాశపరిచాయి.

ఇక ఇప్పుడు పంథా మార్చి టైమ్ ట్రావెల్  నేపథ్యంలో ‘బింబిసార’ సినిమా చేశాడు.  డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ తెరకెక్కించిన

ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల  ముందుకొచ్చింది. మరి బింబిసారగా కళ్యాణ్ రామ్  ప్రయత్నం ఫలించిందా? కంబ్యాక్ హిట్  ఇచ్చిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం!

కథ:

బింబిసార ఒక సోషియో ఫాంటసీ మూవీ.  త్రిగర్తల సామ్రాజ్యాన్ని పరిపాలించే  బింబిసారుడు(కళ్యాణ్ రామ్) తిరుగులేని రాజు. 

శత్రువుల రక్తంతో తన రాజ్యపు సరిహద్దులను  చెరిపేస్తుంటాడు. అలా తన త్రిగర్తల సామ్రాజ్యాన్ని  విస్తరించే క్రమంలో అధికారానికి అడ్డుగా ఉన్నాడని  తోడబుట్టిన సోదరుడు దేవదత్తుడిని సైతం చంపే  ప్రయత్నం చేస్తాడు.

అధికారం ఉందికదా అని అహంతో ఇష్టారీతిన  రాక్షస పాలన చేస్తున్న మదగజ చక్రవర్తి  బింబిసారుడిలో.. ఒక్కసారిగా మార్పు వస్తుంది. మరి అంతటి క్రూరమైన బింబిసారుడిలో  మార్పు ఎలా వచ్చింది?

చరిత్రలో నిలిచిన బింబిసారుడు ఈ తరంలో  ఎంట్రీ ఇవ్వడానికి కారణమేంటి? కాలాన్ని  ఎదురించి ఎలాంటి సవాళ్లు ఫేస్ చేశాడు?  అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ వన్  మ్యాన్ షో. సినిమా మొత్తాన్ని తన  భుజాలపై నడిపించాడు. సాధారణంగా  హిస్టోరికల్ టచ్ ఉన్న సినిమాలలోరాజులు, 

విశ్లేషణ:

బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ వన్  మ్యాన్ షో. సినిమా మొత్తాన్ని తన  భుజాలపై నడిపించాడు. సాధారణంగా  హిస్టోరికల్ టచ్ ఉన్న సినిమాలలోరాజులు, 

యువరాణి ఐరా పాత్రలో కేథరీన్ కథలో  కీలకమే.. ఇక సంయుక్త మీనన్ పాత్ర  తేలిపోయింది. పెద్దగా స్కోప్ లేదు. ప్రకాష్  రాజ్.. విలన్ హుస్సేన్, తనికెళ్ళ భరణి,  అయ్యప్ప వారి పాత్రలకు న్యాయం చేశారు.

ఈ సినిమాకు ఓపెనింగ్ సాంగ్ తో పాటు  డ్యూయెట్స్ బాగున్నాయి. ఎంఎం కీరవాణి  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు గ్రాండియర్  ఫీల్ తీసుకొచ్చింది.

చోటా కే నాయుడు విజువల్స్  అబ్బురపరుస్తాయి. ముఖ్యంగా బింబిసార  ఎపిసోడ్స్ ని సినిమాటోగ్రఫీతో, బిజీఎంతో  ఎలివేట్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్  వేల్యూస్ బాగున్నాయి.

బింబిసార రేటింగ్: 3/5