మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అపర కుబేరుల్లో ఒకరైనప్పటికీ బిల్ గేట్స్ ఓ సామాన్యుడిలా వ్యవహరిస్తూ అందరిని ఆకర్షిస్తుంటారు.

ఇంక దాతృత్వం విషయానికి వస్తే.. రెండు దశాబ్దాల నుంచి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏటా బిలియన్ డాలర్లు సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు.

ఇటీవల బిల్ గేట్స్.. భారత్ పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను, పారిశ్రామికవేత్తలతో బిల్ గేట్స్ సమావేశం అయ్యారు.

అంతేకాక ఇటీవలే ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటాను కలసిన బిల్ గేట్స్.. ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.

అలాగే మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తయారీ కేంద్రాన్ని కూడా సందర్శించారు.

తయారీ కేంద్రంలో కాసేపు సరదాగా ఆ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపారు.

ఎలక్ట్రిక్ ఆటోని స్వయంగా డ్రైవ్ చేస్తూ.. రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. 

అందుకు సంబంధించిన వీడియో ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ వీడియోకి బిల్ గేట్స్.. ఆవిష్కరణల విషయంలో భారతీయులు దాహం ఎప్పటకీ తీరదు. నేనో ఎల‌క్ట్రిక్ రిక్షాను న‌డిపాను.. క్యాప్షన్ పెట్టారు.

ఈ మహీంద్రా ట్రియో ఈవీ  ఆటో రిక్షా 131 కిలోమీట‌ర్ల డ్రైవ్ రేంజ్ తో వస్తోంది.

అంతేకాక ఈ మహీంద్రా ట్రియో ఈవీ ఆటోలో న‌లుగురు సులువుగా ప్రయాణం చేయచ్చు. 

ట్రాన్స్‌ పోర్టు ఇండ‌స్ట్రీలో కార్బన్‌ ర‌హిత వాహ‌నాల‌కు మ‌హీంద్రా కంపెనీ ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని బిల్ గేట్స్ అన్నారు.

బిల్ గేట్స్ పోస్ట్ చేసిన వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.