ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకొని చెలరేగిపోతున్న సీరియల్ కిస్సర్ ను బీహార్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 10న బీహార్‌లోని జముయి జిల్లాలోని సదర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఒక మహిళ ఫోన్‌లో మాట్లాడుతుండగా..
అకస్మాత్తుగా వెనుక నుండి వచ్చిన ఒక యువకుడు ఆమెను బలవంతంగా ముద్దుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి క్షణాల్లో పారిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
అనంతరం ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో అతడిని అరెస్ట్ చేయాలంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయిన పోలీసులు ఎట్టకేలకు ఆ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
వీరి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు, ముఠా నాయకుడిగా పేర్కొంటున్న అక్రమ్ సహా మరో నలుగురిని వలవేసి పట్టుకున్నారు.
అనంతరం వీరిని విచారించిగా ఒళ్లు జలదరించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందరో మహిళలను వీరు ఇలానే వేధించినట్లు విచారణలో వెల్లడైంది.
వీరందరూ గుంపుగా కాకుండా.. ఒక్కొక్కరిగా విడిపోయి ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఒంటరి మహిళలను వేధించడం, బలవంతంగా ముద్దులు పెట్టడమే కాకుండా రాత్రి వేళల్లో దొంగతనాలకు సైతం పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.