ఓ వ్యక్తి నిజమైన ప్రేమకు అర్థం చెప్పాడు. తాను చనిపోయే వరకు భార్య జ్ఞాపకాలతో బతికాడు.

బిహార్‌లోని సిఫాయ్‌ తోలాకు చెందిన భోలానాథ్‌, పద్మారాణిలకు 40 ఏళ్ల క్రితం పెళ్లయింది.

భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరి ప్రేమను చూసి విధికి కన్ను కుట్టింది.

1990 మే 25న భోలానాథ్‌ భార్య పద్మారాణి చనిపోయింది.

భార్య మరణం తర్వాత ఆమె అస్తికలను ఓ కుండలో పెట్టి చెట్టుకు వేలాడదీశాడు భోలానాథ్‌.

ప్రతి రోజూ ఆస్తికల కుండుకు పూజలు చేసేవాడు. ఓ గులాబి పువ్వు చెట్టు దగ్గర పెట్టేవాడు.

క్రమం తప్పకుండా దాదాపు 32 ఏళ్ల పాటు ఇలానే చేశాడు.

తాను చనిపోయిన తర్వాత తన అస్తికలను, భార్య అస్తికలను కలిపి చెట్టుకు కట్టాలని కోరాడు.

ఊరి ప్రజలందరూ ఆయనకు పిచ్చిపట్టిందని అనుకున్నారు. కానీ, ఆయన ప్రేమను తెలుసుకోలేకపోయారు.

జూన్‌ 24, 2022న భోలానాథ్‌ తన భార్య దగ్గరకు వెళ్లిపోయాడు.

ఆయన ఆఖరి కోరిక ప్రకారం.. దంపతుల అస్తికలను కలిపి చెట్టుకు కట్టారు.

కుటుంబసభ్యులు నిత్యం ఆ కుండకు పూజ చేస్తూ ఉన్నారు.

ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు.. బయటినుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆ కుండకు నమస్కారం చేస్తున్నారు.