యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పేరు తెలియని వారుండరేమో.

‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్గా ఎదిగిన గంగవ్వ

చిన్న పిల్లల నుంచి అటు పండు వయసున్న ముసలవ్వలు వరకు ప్రతీ ఒక్కరు గుర్తుపడతారు.

అలా వచ్చిన ఇమేజ్ తో సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది గంగవ్వ. 

ఇక అనంతరం బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకూడా అడుగుపెట్టి అందరినీ ఎంటర్ టైన్ చేసింది.

ఇక ఇందులో గంగవ్వ తన చిరకాల స్వప్నం నూతన ఇల్లు నిర్మించుకోవటమేనని చెప్పటంతో హోస్ట్ నాగార్జున కూడా కొంత సాయం చేశారు.

 దీంతో గంగవ్వ అనుకున్నట్లుగానే తన చిరకాల స్వప్నం నెరవేరి నూతన ఇల్లు నిర్మాణం కూడా పూర్తైంది.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది.

 ఇక ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు..

 బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్, శివజ్యోతి, మై విలేజ్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. 

ఇక దీనికి సంబంధించిన వీడియోను మై విలేజ్ షో సభ్యులు..

యూ ట్యూబ్ లో పోస్ట్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.