ఈమె పూర్తి పేరు మామిళ్ళ శైలజ ప్రియా. రాజస్థాన్ లో పుట్టింది.1978వ సంవత్సరం మే 20న జన్మించింది. ఈమె తండ్రి ఆర్మీలో పని చేసేవారు. ఈమె మథర్ హౌస్ వైఫ్.
ఈమె విద్యాభ్యాసం హైదరాబాద్లోనే జరిగింది.అయితే 10వ తరగతి తర్వాత కొన్ని కారణాల వలన ఈమె చదువుకి బ్రేక్ వచ్చింది. కొన్నాళ్ల తర్వాత డిస్టెన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది..
ప్రియా తల్లి గారికి ఈమెను హీరోయిన్ గా చూడాలని కోరిక. కానీ ఈమె తండ్రి గారికి అది ఇష్టం లేదు.అయినప్పటికీ కూతురు మీద ఉన్న ప్రేమతో ఆ ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదు.
కెరీర్ ప్రారంభంలో ఈమె సీరియర్స్ లో నటించేది.ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ‘ప్రియసఖి’ సీరియల్ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సీరియల్స్ లో నటించింది ప్రియా. అక్కడ కూడా ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ఏకంగా బ్యానర్లు కూడా కట్టేవారంటే అతిశయోక్తి లేదు.
సౌందర్య,వినీత్ నటించిన ‘తాంబూలాలు’ చిత్రంలో ఈమెకు మొదటి అవకాశం వచ్చింది. కానీ 1997 లో వచ్చిన ‘దొంగాట’ చిత్రంతో ఈమె వెండితెరకు పరిచయమైంది.
రాజశేఖర్, సాక్షి శివానంద్ లు అందులో హీరో, హీరోయిన్లుగా ఎంపికమయ్యారు. కానీ కొన్ని కారణాల వలన ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది.
ఇక ప్రియాకి ఇష్టమైన హీరోయిన్ సౌందర్య. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా ఆమెనే స్పూర్తట. అంతేకాకుండా సౌందర్య ఈమెకు మంచి స్నేహితురాలు కూడా..!
దాదాపు 25 ఏళ్ళుగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇంతకాలం ఆమె ఇండస్ట్రీలో రాణించడానికి ప్రేక్షకులే ముఖ్య కారణం అని భవిస్తూ ఉంటుంది ప్రియా.
ఇక ఈమె డ్రీం రోల్ ‘అరుంధతి’ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి పాత్ర తనకి ఎందుకు దక్కలేదా అని ఈమె ఫీల్ అవుతూ ఉంటుందట.
2002 లో ఎం.వి.ఎస్ కిషోర్ అనే వ్యక్తిని ఈమె వివాహం చేసుకుంది. వీళ్లకు ఓ బాబు. ప్రస్తుతం అతని వయసు 18 సంవత్సరాలు అని తెలుస్తుంది.
’చంద్రలేఖ’ ‘చిరునవ్వుతో’ ‘మిర్చి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘బాబు బంగారం’ వంటి చిత్రాలు ప్రియాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.