సినిమా బాగుందంటే చాలు అది ఏ భాషకు చెందినదనేది తెలుగు ఆడియెన్స్ పట్టించుకోరు. 

అందుకే తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల చిత్రాలు తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంటాయి.

అలా తెలుగులో అనువాదమైన చిత్రాల్లో ‘బిచ్చగాడు’ ఒకటి. 2016లో వచ్చిన ఈ తమిళ మూవీని తెలుగు ప్రేక్షకులు డబుల్ బ్లాక్​బస్టర్ చేశారు.

ఒక్క చిత్రంతో విజయ్ ఆంటోని ఇక్కడ కూడా స్టార్ అయిపోయారు. 

దాదాపు ఏడేళ్ల తర్వాత ‘బిచ్చగాడు’ సీక్వెల్ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. 

ప్రేక్షకులు మంచి అంచనాల నడుమ విడుదలైన విజయ్ ఆంటోనీ తీసిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ: విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారత్​లోని సంపన్నుల్లో ఏడో ప్లేసులో ఉంటాడు. విజయ్ సంస్థలో పనిచేస్తున్న అతడి మిత్రుడు అరవింద్ (దేవ్ గిల్) కన్ను విజయ్ ఆస్తి మీద పడుతుంది. 

టీవీలో బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ గురించి చెప్పింది విన్న అరవింద్.. విజయ్ ను చంపేసి, దీన్ని అమలు చేయాలని చూస్తాడు.

విజయ్​కు సరిపోయే బ్రెయిన్ కోసం వెతుకుతాడు అరవింద్. ఆ తర్వాత ఏం జరిగింది?

ఈ మొత్తం స్టోరీలో సత్య (విజయ్ ఆంటోని) ఎవరు? అతడు మొదలుపెట్టిన ‘యాంటీ బికిలీ’ సంగతేంటనేది మిగిలిన కథ.

విశ్లేషణ: ‘బిచ్చగాడు’లో తల్లి సెంటిమెంట్ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించింది. రెండో పార్ట్​లో సిస్టర్​ సెంటిమెంట్​ను నమ్ముకున్నారు. 

‘బిచ్చగాడు-2’లో ఎమోషనల్ కంటెంట్ తో పాటు థ్రిల్లింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులకు మంచి ఎక్స్ పీరియెన్స్ ఇచ్చారు. 

ఇంటర్వెల్ వరకు సినిమాను ఒక రేంజ్​లో తీసుకెళ్లిన దర్శకుడు.. సెకాండాఫ్​లో మాత్రం ఆ టెంపోను కొనసాగించడంలో తడబడ్డాడు.  

బిచ్చగాడు-2’ను ఫస్ట్​ పార్ట్​తో పోల్చకూడదు. ఎందుకుంటే తొలి పార్ట్​లో ఓన్లీ సెంటిమెంట్​ను నమ్ముకుంటే.. 

సీక్వెల్​లో సెంటిమెంట్​తో పాటు యాక్షన్​, థ్రిల్ అంశాలను నమ్ముకున్నారు. ఇందులో చాలా వరకు విజయవంతం అయ్యారు కూడా.

నటీనటుల పనితీరు: ‘బిచ్చగాడు-2’ను అన్నీ తానై నడిపించారు విజయ్ ఆంటోని. సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఆయన.. మ్యూజిక్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గానూ తానే వ్యవహరించారు. నటనలో ఆయన బాగా సక్సెస్ అయ్యారు. 

క్లైమాక్స్​లో విజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా మాత్రం ఆయన ఫర్వాలేదనిపించారు.  

సినిమా మొదట్లో గ్లామర్​తో కవ్వించిన హీరోయిన్ కావ్యా థాపర్.. ఆ తర్వాత నటిగానూ ఆకట్టుకుంది. 

ఇందులో దేవ్​ గిల్​కు మంచి పాత్ర పడింది. విలన్​గా తన పాత్రకు ఆయన న్యాయం చేశాడు. 

టెక్నికల్ టీమ్ పనితీరు: ‘బిచ్చగాడు-2’లో సినిమా రైటింగ్​, డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాల బాధ్యతలను విజయ్ ఆంటోనీనే తీసుకున్నారు. వాటిని ఆయన బాగానే హ్యాండిల్ చేశారు. 

ఈ మూవీలో సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ విలువలు రిచ్​గా ఉన్నాయి. పాటల కంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 

ఓవరాల్​గా చెప్పొచ్చేది ఏంటంటే.. విజయ్ ఆంటోనీకి చాన్నాళ్ల తర్వాత ‘బిచ్చగాడు-2’తో మరో మంచి హిట్ పడినట్లే. 

ఫస్ట్ పార్ట్ చూడనివారు కూడా దీనికి వెళ్లొచ్చు. ఇది నచ్చేస్తుంది కూడా! 

ప్లస్ పాయింట్స్: కథ, విజయ్ ఆంటోని నటన, ప్రొడక్షన్ విలువలు. 

మైనస్ పాయింట్స్: ఇంటర్వెల్ తర్వాత కాస్త ల్యాగ్, సాంగ్స్, యోగిబాబు హాస్యం. 

రేటింగ్: 2.5