పబ్జీని మన దేశంలో బ్యాన్ చేయకముందే పత్రి నెల 50 వేల మిలియన్ యూజర్లు యాక్టివ్ గా ఉండేది.
ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66 కింద కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం అప్పట్లో కొన్ని చైనీస్ యాప్స్ ను బ్యాన్ చేసింది. అందులో పబ్జీ కూడా ఒకటి.
ఉన్నట్టుండి ఆ యాప్ ను బ్యాన్ చేయడంతో పబ్జీ ప్రియులకు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఈ క్రమంలోనే దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ పబ్జీ ప్రియులకు గుడ్ న్యూస్ ను అందించింది.
త్వరలో భారత్ లో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఆపరేషన్ ను తిరిగి తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్నాయని తెలిపింది.
ఇదే విషయాన్ని ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ తాజాగా అధికారికంగా తెలపడం విశేషం. దీనికి భారత అధికారులు కూడా అనుమతులు ఇచ్చినట్లు ప్రకటించింది.
భారత చట్టాలకు అనుగుణంగానే బీజీఎంఐను పునఃప్రారంభిస్తున్నామని దక్షణి కొరియా కంపెనీ అయిన క్రాప్టాన్ తెలిపింది.
మా ప్లేయర్లకు మంచి గేమింగ్ అనుభూతిని అందించడంతో పాటు వారి అభిరుచి మేరకు అలసిపోకుండా పని చేస్తామని హామీ ఇచ్చింది.
ఇదే కాకుండా భారతీయ గేమిగ్ ఎకో సిస్టమ్ కి కట్టుబడి ఉన్నామని కూడా తెలిపింది.
దీంతో పాటు భారతీయుల ప్రతిభను గుర్తించి శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది.
భారత్ లో తిరిగి బీజీఎంఐ మళ్లీ మొదలు కానుందని తెలుసుకున్న పబ్జీ ప్రియులుు ఎగిరి గంతేస్తున్నారు.