సాధారణంగా పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అలాంటి మొక్కల్లో ఒకటి తమలపాకు.

తమలపాకుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కొబ్బరినూనెనీ తమలపాకురసాన్ని కలిపి చెవిలో వేస్తే చెవినొప్పి నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది

ఆకలి నుంచి.. అరుగుదల వరకు..  తమలపాకులు సంజీవనిలా పనిచేస్తుంది.

కడుపు  ఉబ్బరంగా అనిపిస్తే.. రెండు తమలపాకు రసంలా చేసి పాలలో కలుపుకుని తాగితే బ్లోటింగ్ సమస్య చిటికలో తగ్గిపోతుంది.

తలనొప్పికి కానీ మైగ్రైన్ కి కానీ తమలపాకులు ఎంతో దివ్య ఔషధంలా పని చేస్తాయి.

ప్రతిరోజూ తమలపాకులు తీసుకుంటే డిప్రేషన్ నుంచి దూరం కావొచ్చు

జీర్ణప్రక్రియలో అరుగుదలకు సహకరించే యాసిడ్స్ ను ఉత్పత్తి చేయడానికి తమలపాకు ఉపయోగపడుతుంది.

చిన్న గాయాలు కానీ వాపు, నొప్పి కలిగితే తమలపాకులని నొప్పి ఉన్న చోట ఉంచితే ఉపశమనం కలిగుతుంది.

రోజూ తమలపాకులను తినడం ద్వారా దగ్గు, జలుబు సమస్యలను దూరంగా ఉంచవొచ్చు.

తమలపాకు నాచురల్ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. చిగుళ్ళని బలోపేతం చేసి దంతక్షయాన్ని నివారిస్తుంది.

అయితే..మోతాదుకు మించి తమలపాకులను తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం.