వేసవికాలం వచ్చిందంటే డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా  ఉంటుంది. అలసట, విపరీతమైన చెమట, గుండెల్లో  మంట, అతిసారం, యూటీఐ, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం  వంటి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.

వేసవికాలం వచ్చిందంటే డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా  ఉంటుంది. అలసట, విపరీతమైన చెమట, గుండెల్లో  మంట, అతిసారం, యూటీఐ, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం  వంటి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.

ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే  కడుపుని, శరీరాన్ని చల్లబరిచే  శీతల పానీయాలు తాగాలి.

వేసవిలో తాగాల్సిన పానీయంలో అందరూ  ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది మజ్జిగ.  మజ్జిగలో ఉండే ప్రోబయాటిక్స్ గట్  ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

మజ్జిగలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణ సంబంధ  ' సమస్యలను దూరం చేస్తాయి.  వడదెబ్బ నుంచి కూడా రక్షిస్తుంది.

వేసవిలో నిమ్మరసం తాగడం చాలా మంచిది.  ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు  రాకుండా నిమ్మరసం కాపాడుతుంది. 

వేసవి కాలం వచ్చిందంటే అధిక వేడి కారణంగా  ఒంట్లో నీటి శాతం పడిపోతుంది. రోజూ నిమ్మరసం  తాగడం వల్ల నీటి శాతం పడిపోకుండా ఉంటుంది. 

సబ్జా గింజలను నానబెట్టిన నీటిలో  నిమ్మ కాయలు పిండి ఆ రసాన్ని తాగితే శరీరంలో  ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్ర విసర్జన  సమయంలో మంట రావడం వంటి సమస్యలు  వేసవి కాలంలో ఎక్కువగా వస్తుంటాయి.  ఇలాంటి సమస్యలకు కొబ్బరి నీళ్ళతో చెక్ పెట్టవచ్చు.

కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా  ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తాయి. 

కొబ్బరి నీళ్లలో 9 శాతం ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.  ఎసిడిటీ సమస్య ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే  ఉపశమనం లభిస్తుంది. 

చెరుకు రసం తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్  కాకుండా ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా  ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్ధకం  సమస్య ఉన్నవారు చెరకు రసం తాగితే పరిష్కారం  దొరుకుతుంది.

వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా పిత్తదోషం  ఏర్పడుతుంది. నిద్రపోయే ముందు పాలలో  పటిక బెల్లం వేసుకుని తాగితే సమస్య తీరుతుంది.  పైగా శరీరాన్ని చల్లబరచడమే గాక నిద్ర కూడా  బాగా పడుతుంది.

వేసవిలో అరటి దిండు రసం తాగడం చాలా  మంచిది. అరటి చెట్టు లోపల ఉండే తెల్లని  పదార్థాన్ని అరటి దిండు అంటారు.

ఇందులో పొటాషియం, విటమిన్ బి6, ఐరన్,  ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. దీని వల్ల  కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు  రాకుండా ఉంటాయి. 

గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన  సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని  మీద అవగాహన కోసం నిపుణులను  సంప్రదించవలసినదిగా మనవి.