Running

ఇప్పుడంతా  డిజిటల్ ప్ర‌పంచమే.

స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్.. ఇలా ప్ర‌తిదీ స్మార్టే. ఇవన్నీ పక్కన పెడితే..  మనం స్మార్ట్ ఫోన్లకు ఎలా బానిసులమయ్యామో.. ఇప్పుడు స్మార్ట్ వాచ్‌లకూ అలానే ఆకర్షితులమవుతున్నాం.

చూడడానికి స్టైలిష్ గా ఉండడం, హెల్త్ ఫీచర్స్, కాలింగ్ ఆప్షన్ తో పాటు ధరకూడా తక్కువుగా ఉంటుండడంతో వీటి డిమాండ్ జోరందుకుంది.

ఈ క్రమంలో రూ. 2000లోపు ధరలో ఉన్న కొన్ని స్మార్ట్ వాచెస్ వివరాలు మీకు అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌వాచ్‌ని సొంతం చేసుకోండి.

బోట్ వేవ్ లైట్

ఇందులో 500నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌తో1.69-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. RGB కలర్ గామట్‌ 70 శాతం ఉంటుంది. 24*7 హార్ట్ బీట్ రేటును పర్యవేక్షించగలదు.

బోట్ వేవ్ లైట్ ఫీచర్స్ 

నిద్ర, SpO2ని కూడా ట్రాక్ చేస్తుంది. ఫుట్‌బాల్, యోగా, సైక్లింగ్, వాకింగ్, బ్యాడ్మింటన్, వాకింగ్, రన్నింగ్, బాస్కెట్‌బాల్, స్కిప్పింగ్, క్లైంబింగ్, స్విమ్మింగ్ వంటి 10 స్పోర్ట్స్ మోడ్స్‌లో అందుబాటులో ఉంది. దీన్ని రూ. 1,499కు సొంతం చేసుకోవచ్చు.

బోట్ వేవ్ లైట్ ఫీచర్స్ 

ఫైర్-బోల్ట్ నింజా 3

ఈ స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1499కు అందుబాటులో ఉంది. 1.69 ఇంచుల డిస్‌ప్లేతో దీన్ని లాంచ్ చేసారు.

ఫైర్-బోల్ట్ నింజా 3

ఇందులో రియల్ టైమ్ 24*7 SPO2 / బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్, డైనమిక్ హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి అనేక హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి.

ఫైర్-బోల్ట్ నింజా 3

నాయిస్ కలర్‌ఫిట్  పల్స్ గ్రాండ్

ప్రస్తుతం ఇది అమెజాన్ లో రూ.1,499కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ 1.69-అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో లాంచ్ అయింది.

నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్

ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, Spo2 సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆంతేకాకుండా.. 60 స్పోర్ట్స్ మోడ్స్, 150 వాచ్ ఫేసెస్, ఫాస్ట్ ఛార్జింగ్.. వంటి ఫీచర్స్ ఉన్నాయి.

నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్

నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 2

ఇందులో 1.8 ఇంచుల పెద్ద డిస్‌ప్లే ఉంటుంది. 550నిట్స్ బ్రైట్‌నెస్, స్లీక్ మెటాలిక్ బాడీ, 50 స్పోర్ట్స్ మోడ్స్, 24*7 హార్ట్ బీట్, స్లీప్ అండ్ Spo2 మానిటరింగ్, కాల్స్, ఎస్ఎంఎస్.. వంటి ఎన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. దీన్ని రూ.1,799కు సొంతం చేసుకోవచ్చు.

నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 2

నాయిస్ పల్స్ బజ్  రూ. 1,999

టాగ్ వెర్వ్ నియో రూ. 1,399

బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్ వాచ్ రూ. 1,899 ధరలో అందుబాటులో ఉన్నాయి.