మన పెద్దలే కాకుండా ఆయుర్వేద నిపుణులు కూడా వంటగది మసాలా దినుసులు, మూలికలను ప్రతిరోజూ వాడాలని సూచిస్తుంటారు.
మెంతి గింజలు ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మెంతులు వంటకాల రుచిని పెంచడంతోపాటు మధుమేహాన్ని నియంత్రించగలవు.
మహిళల్లో యుటేరియన్ కాంట్రాక్షన్ స్టిములేట్ చైల్డ్ బర్త్ ను సులభతరం చేస్తుంది. ఇది లేబర్ పెయిన్(ప్రసవ నొప్పులను)తగ్గిస్తుంది.
ఒక చెంచా మెంతులను మీ భోజనంలో తీసుకోవడం ద్వారా ఎసిడిక్ రిప్లెక్షన్ మరియు హార్ట్ బర్న్ తగ్గిస్తుంది.
మెంతులు టైప్ 1, టైప్ 2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తుంది. మెంతుల్లో ఉండే ట్రైగోనెల్లిన్, కౌమారిన్ అనే తత్వాలు మధుమేహం మీద పని చేస్తాయి.
మధుమేహ నియంత్రణ కోసం మెంతులను రోజుకి 50 గ్రాములను, రెండు మూడు డోసులుగా విభజించి తీసుకోవాల్సి ఉంటుంది.
మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
మెంతులను తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గొంత సంబంధిత సమస్యలను నివారిస్తుంది.