ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధ గుణం ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది.

కొన్ని కోట్లాది మొక్కల ఔషధ గుణాలు, వాటి ఉపయోగాలను ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు.

తుంగ గడ్డల అనే అద్భుతమైన మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

తుంగ గడ్డి అనేది ఓ కలుపు మొక్క గా చాలా మంది భావిస్తూ ఉంటారు.

తుంగగడ్డిలనే కొన్ని ప్రాంతాల్లో తుంగభటికలు, తుంగమస్తలు అని కూడా పిలుస్తారు

తుంగ గడ్డలు జాండీస్ ను నయం చేయడానికి మంచి ఔషధంలా పని చేస్తుంది.  

అలానే తుంగ గడ్డలతో చేసిన కషాయం తాగితే కామెర్ల వ్యాధి తగ్గిపోతుంది.

 బట్టతలపై వెంట్రుకలు తిరిగి మొలిపించడంలో తుంగ గడ్డలు అద్భుతంగా పని చేస్తుంటాయి.

తుంగ గడ్డలను ఎండబెట్టి.. కొబ్బరి నూనెలో మరిగించి తలకు పట్టిస్తే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.

బట్టతలపై కూడా వెంట్రుకలు మొలిచేందుకు పునరుద్జీవంగా తుంగగడ్డ పని చేస్తుంది.

తుంగ గడ్డల ఎండబెట్టి వాటిని చూర్ణంగా చేసి చందనం కలిపి ముఖంపై రాసుకుంటే మొటిమలు పోతాయి.

అంతేకాదు నల్లటి నలుపు సైతం తొలగిపోయి మొహం చంద్రబింబంలా మెరిసిపోతుంది

ఒక రకంగా చెప్పాలంటే  తుంగ గడ్డలు సర్వరోగ నివారిణి అనేది వాస్తవం.

తుంగ గడ్డలపై నేటికి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ఆయుర్వేద నిపుణుడి సలహాలతో వాడటం ద్వారా వ్యాధులనుంచి బయటపడొచ్చు.

ఇందులోని అంశాలు ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది.

ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.