గాడ్ ఫాదర్ మూవీలోని బెస్ట్ డైలాగ్స్!

మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు..  చాలా డ్రామాలు జరుగుతున్నాయి..  అన్ని రంగులు మారతాయి!

మన కళ్ళముందు కొట్టుకు చస్తుంటే..  మనం కళ్లు మూసుకోవడం ఉత్తమం అని  రాజకీయపెద్దలు చెప్పారు!

ప్రోటోకాల్ కారుకే గానీ..  నా కాళ్ళకు కాదుగా!

మన దేశంలో వెలుతురులో చేసే ఒకే ఒక తప్పు  పాలిటిక్స్.. మిగతావన్నీ ఎంత సీక్రెట్ గా చేస్తే  అంత మంచిది..

మీరు తిడితే వాళ్లు మారిపోతారని  అనుకుంటున్నారా.. డేంజర్ నా కొడుకులు!  పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల్లో నుండి  డబ్బులు లాగొచ్చో రూట్లు చూపించారు

డబ్బు లేకపోతే ఎవ్వడు ఉండడు పార్టీలో..  అలా దోచుకున్న డబ్బుతోనే నాలుగేళ్లుగా  పార్టీని నడిపిస్తున్నా..

నేలమీద ఉన్నప్పుడు గాల్లో మేడలు  కడుతున్నారు కదా.. అందుకే గాల్లో  ఉన్నప్పుడు చెప్తున్నా.. గ్రౌండ్ రియాలిటీ అర్థం  కావాలని!

మన అవసరాన్ని ఎదుటివాడి అవసరంగా  మారిస్తే.. తర్వాత మనం కష్టపడే అవసరం  లేదు.. మనకోసం వాళ్లే కష్టపడతారు..

నిన్ను కాపాడటానికి ఎవ్వడున్నాడురా బచ్చా..  నాకు కావాల్సింది పద్ధతి!

కింగ్ నైనా కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది  బ్రహ్మ.. గుర్తుంచుకో!

నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు  జరగనివ్వను.. ఈ కుర్చీకి చెద పట్టనివ్వను!

ఇక్కడొక నిర్ణయం తీసుకోవాలంటే హోదా  కావాలి.. ఒక పదవి కావాలంటే అర్హత  ఉండాలి.. ఎవరో ఏదో చెప్తే అది చెల్లదు!

వారసత్వం అంటే పదవి కాదు.. బాధ్యత!

శత్రువు గుర్తించని విజయం.. ఓటమికంటే  అవమానం లాంటిది!

నా ప్రాణం ఖరీదెంతో నువ్వే చెప్పావుగా..  వదులుకుంటానా.. ఇక ఆట మొదలెడదామా!

నిన్ను పంపినవాడికి చెప్పు! నేను రాజకీయం  నుండి దూరంగా ఉన్నాను, రాజకీయం నా  నుండి దూరం కాలేదు!

నిన్ను క్షమించడానికి నేను మహాత్ముడిని  కాను.. అన్ని ఓర్చుకోడానికి పరమాత్ముడిని  కాను..తప్పు ఏమాత్రం సహించలేని ఓ  సాధాసీదా మనిషిని!

నేను చాలా మంచివాడిని అని చెప్పను.. కానీ,  చెడ్డవాడ్ని కాదని మాత్రం నిజాయితీగా  చెప్పగలను!

నిజాయితీగా ఉండి పీకిందేంటి? రాత్రికి రాత్రే  మారిపోవడానికి ఇది సమయం కాదు..  సమాజం!

ఇక్కడ బలహీనుడి నిజం కంటే.. బలవంతుడి  అబద్దానికే విలువ ఎక్కువ! అందుకే  నిజమెప్పుడు ఓడిపోతుంటుంది..

మనం కలవాలని.. మనకంటే ఎక్కువగా  కోరుకున్న మనిషి ముందు మనం ఉన్నాం..  నాకు మిగిలున్న ఒకే ఒక బంధానివి నువ్వే!

తప్పుల్లో పెద్ద తప్పు ఏంటో తెలుసా! మంచి  చేసినవారికి ఎందుకు ఆ మంచిచేశాం  అనిపించేలా చేయడం..

ఈ సమాజంలో వస్తువులను దొంగిలించే  వారిని దొంగలంటారు.. మరి వాస్తవాలు  దొంగిలించేవారిని ఏమనాలి.. న్యూస్ ఛానల్స్  అనాలా!

మీరు డీల్ చేసింది జయదేవ్ తో కాదు..  మాట తప్పితే మనిషినే తప్పించే బ్రహ్మతో.!

ఆపేసారేం.. మొరగండి! మీ అరాచకాలను  భరించడానికి, మీ విధ్వంసాలకు బలవ్వడానికే  కదా.. జనం మిమ్మల్ని ఎన్నుకుంది!

ఇన్నాళ్లు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు,  నీళ్ల కాంట్రాక్టులు, కొండా.. నేల.. మందు కాంట్రాక్టులు  అంటూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రజల సొమ్ము తిని  అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు..  ఈరోజు నుండి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నాది!

తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ  మనసుల్లో ఉండాలి.. లేదంటే మీ ఊపిరి  గాల్లో కలిసిపోతుంది!