ప్రస్తుతం అంతా స్మార్ట్‌ యుగం అయిపోయింది.

ఫోన్లు, వాచ్‌లు ఎలా అయితే స్మార్ట్‌ అయిపోయాయో.. టీవీలు కూడా సాధారణం నుంచి స్మార్ట్‌ అయిపోయాయి.

ఇప్పుడు ఎవరు టీవీ కొనాలన్నా స్మార్ట్‌ టీవీల వైపే చూస్తున్నారు.

నిజానికి చాలా కంపెనీలు మామూలు టీవీలను తయారు చేయడం కూడా మానేశాయి.

అయితే ఏ టీవీ కొనాలి? ఎంతలో అయితే బెస్ట్‌ టీవీ లభిస్తుందో చాలా మందికి తెలియదు.

అలాంటి వారి కోసం ఈ ఆర్టికల్‌ లో రూ.30 వేలలోపు లభిస్తున్న బెస్ట్‌ స్మార్ట్ టీవీల వివరాలు చూద్దాం.

వీయూ ప్రీమియం 4కే  50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ

స్మార్ట్‌ టీవీల్లో ప్రస్తుతం వీయూ కంపెనీకి కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ కంపెనీ నుంచి అత్యంత తక్కువ ధరలోనే 50 ఇంచెస్‌ స్మార్టీవీని అందుబాటులోకి తీసుకొచ్చారు. అది కూడా 4కే రెజల్యూషన్‌తో ఉండటం విశేషం.

ఈ టీవీ అన్ని ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌ సైట్స్‌ లో గరిష్టంగా రూ.29,999 వరకు అందుబాటులో ఉంది. ఈ వీయూ ప్రీమియం 4కే స్మార్ట్‌ టీవీలో నెట్‌ ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, గూగుల్‌ అసిస్టెంట్, హాట్‌ స్టార్, గూగుల్ ప్లే మూవీస్ వంటి ఇన్‌ బిల్ట్‌ యాప్స్‌ ఉంటాయి.

ఈ టీవీపై కంపెనీ నుంచి  1 ఇయర్ వారెంటీ లభిస్తుంది.

కోడక్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్‌ టీవీ

ఈ కోడక్ 7ఎక్స్ ప్రో 50 ఇంచెస్‌ టీవీ 4కే అల్ర్టా హెచ్‌ డీ రెజల్యూషన్‌ తో అందుబాటులో ఉంది. అది కూడా కేవలం 27,999 రూపాయలకే 50 ఇంచెస్‌ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రైమ్‌ వీడియో, జీ5, ఆక్సిజన్‌ ప్లే, ఈరోస్‌ నౌ, జియో సినిమా, సోనీ లివ్, యూట్యూబ్, హంగామా, హాట్ స్టార్‌ వంటి ఇన్‌ బిల్ట్‌ యాప్స్‌ తో ఈ టీవీ లభిస్తోంది. 2 జీవీ ర్యామ్‌, 8 జీబీ రోమ్‌, డ్యూయల్ బాండ్ వైఫై, 40 వాట్‌ స్పీకర్‌ వంటివి ఈ టీవీలో ప్రత్యేకతలు.

వన్‌ ప్లస్‌ 43 ఇంచెస్‌  వై సిరీస్‌ 4కే

వన్‌ ప్లస్‌ నుంచి స్మార్ట్‌ ఫోన్లకు ఎంత డిమాండ్‌ పెరిగిందో.. అలాగే స్మార్ట్‌ టీవీలకు కూడా అదే తరహా ఆదరణ లభిస్తోంది. ఈ 43 ఇంచెస్‌ వన్‌ ప్లస్‌ 43వై1ఎస్‌ ప్రో స్మార్ట్‌ టీవీ అన్ని ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌ సైట్స్‌ లో గరిష్టంగా రూ.29,999కి లభిస్తోంది.

1 బిలియన్‌ కలర్స్‌ తో కూడిన 4కే రెజల్యూషన్‌, డాల్బీ ఆడియోతో ఈ టీవీని రూపొందించారు. ఇందులో అన్ని ఓటీటీ యాప్స్‌ ఇన్‌ బిల్ట్‌ గా లభిస్తున్నాయి.

రెడ్‌ మీ 43 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ

రెడ్‌ మీ నుంచి అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీలకు కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఈ 43 ఇంచెస్‌ టీవీ ఆన్‌ లైన్‌ లో గరిష్టంగా రూ.26,999కి లభిస్తోంది.

ఈ టీవీ 2 జీబీ ర్యామ్‌, వైఫై కనెక్టవిటీ, యూఎస్బీ, హెచ్‌డీఎంఐ సపోర్ట్‌ ఉంటుంది. డాల్బీ ఆడియో, 60 హెట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ వంటి ఫీచర్లతో ఈ రెడ్‌ మీ స్మార్ట్‌ టీవీ అందుబాటులో ఉంది.

తొషిబా వీ సిరీస్.. 43వీ35కేపీ

ఎలక్ట్రానిక్స్ కు సంబంధించి అందరికీ తెలిసిందే తొషిబా లీడింగ్‌ కంపెనీ అని. కేవలం 22,990కే 43 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ టీవీని తొషిబా కంపెనీ అందిస్తోంది. ఈ టీవీ 8 జీబీ రోమ్‌, 1 జీబీ ర్యామ్‌, స్టీరియో స్పీకర్స్‌, క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ తో ఈ టీవీ లభిస్తోంది.

రూ.30 వేలలోపు బెస్ట్‌ 50 ఇంచెస్‌, 43 ఇంచెస్‌ టీవీలేంటో చూశారుగా.. పైన చెప్పుకొన్న టీవీల్లో ఏది మీరు కొనాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

అంతేకాకుండా మరేదైనా స్మార్ట్‌ టీవీ, గాడ్జెట్స్‌ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే దాని పేరు కామెంట్‌ చేయండి.