సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్ ఇలా అంశం ఏదైనా వార్తాపత్రికల్లో సెటైరికల్ గా చెప్పాలంటే కార్టూన్లను మించి మరొకటి ఉండేది కాదు.

కానీ ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియాను వాడుకుంటూ చాలా మంది తమ టాలెంట్​ను నిరూపించుకుంటున్నారు. 

ఈ క్రమంలో బాగా పాపులర్ అయినవే మీమ్స్. 

సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లోని ప్రముఖుల ఫొటోలు, డైలాగుల సాయంతో నెటిజన్లు సంధించే సెటైర్లు మామూలుగా ఉండవు. అవి బాగా వైరల్ అవుతున్నాయి. 

సెలబ్రిటీల డైలాగులను పంచ్​ లైన్లుగా వాడుతూ చేసే మీమ్స్​కు యూత్​లో మంచి క్రేజ్ ఉంది. 

యువతకు చేరువయ్యేందుకు మీమ్స్ ఇప్పుడో మార్గంగా మారింది.

ఇప్పటికే రాజకీయ ప్రచారాల్లో, బిజినెస్ అడ్వర్టయిజ్​మెంట్లలో ఈ ట్రెండ్ బాగా కనిపిస్తోంది.

యువత నాడిని పట్టేసిన బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ మీమ్స్ చేసేవారికి క్రేజీ ఆఫర్ ఇచ్చింది.

తమ కంపెనీలో మీమ్స్ ఆఫీసర్​గా చేరితే నెలకు రూ.లక్ష జీతం ఇస్తామని స్టాక్ గ్రో అనే సంస్థ ప్రకటించింది. 

యువతను ఆకట్టుకునేలా మీమ్స్​ చేస్తే జాబ్ ఇస్తామంటూ లింక్డ్​ఇన్​లో స్టాక్ గ్రో ఓ ప్రకటన చేసింది. 

మీమ్స్ ఎక్స్​పర్ట్​లను వెతికి పట్టుకునేందుకు సహకరించిన వారికి ఒక ఐప్యాడ్ గిఫ్ట్​గా ఇస్తామని ఊరిస్తోంది స్టాక్ గ్రో. 

మీలో గనుక మంచి మీమ్స్ చేసే ప్రతిభ ఉంటే వెంటనే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి.