శరీరానికి అవసరమైన ఖనిజాల్లో ముఖ్యమైనది ఐరన్.
ఐరన్ లోపిస్తే తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. మైకం కమ్ముకుంటుంది.
గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఛాతిలో నొప్పి పుడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహరం తినడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయి.
శరీరంలో ఐరన్ పుష్కలంగా ఉంటే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరుస్తుంది.
ఐరన్ అలసటను, తలనొప్పిని తగ్గించడానికి దోహదపడుతుంది.
ఐరన్ వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. కంటి కింద నల్లటి వలయాలు ఉంటే ఐరన్ తొలగిస్తుంది.
శరీర భాగాలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా ఐరన్ సహాయపడుతుంది.
ఐరన్ ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. ఎలాంటి గాయాలనైనా వెంటనే నయం చేస్తుంది.
పిల్లలు ఆకలి లేదంటే.. ఐరన్ ఉండే ఆహార పదార్థాలు పెడితే పుష్టిగా ఉంటారు.
ఆపిల్, జామ పండు, ఉసిరి, ఖర్జూర పండ్లు, దానిమ్మ, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్ లో ఐరన్ అధికంగా ఉంటుంది.
బీట్ రూట్, క్యారెట్, నిమ్మకాయ, ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా, పుట్టగొడుగులు, కొత్తిమీర, బీన్స్ వంటి కూరగాయల్లో ఐరన్ ఉంటుంది.
బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరల్లోనూ.. కోడిగుడ్డు, మటన్ లివర్ లలో ఐరన్ అధికంగా ఉంటుంది.
పల్లీలు, అవకాడో, నువ్వులు, ఎండు ద్రాక్ష, పిస్తా పప్పు, బాదంపప్పు, జామూన్, పాలు వంటి ఆహార పదార్థాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది.