ప్రాచీన భారతీయులకు అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయువును అందించిన అమృత ఔషధం గుంటగలగర. సంస్కృతంలో దీన్ని భృంగరాజ అంటారు.
ఈ గుంటగలగరాకు హెర్బ్‌ను ఫాల్స్ డైసీ అని కూడా అంటారు. ఈ మొక్కలో రెండు రకాల జాతులు ఉన్నాయి.
ఒక మొక్క పసుపు పువ్వులను ఇస్తుంది, మరొకటి తెల్లని పువ్వులను కలిగి ఉంటుంది.
రెండు రకాల పువ్వులు నూనెను తయారు చేడానికి ఉపయోగిస్తారు, కాని ఎక్కువగా ఉపయోగపడే రకం తెలుపు పుష్పించే భింగ్రాజ్ మొక్క.
దీని ఆకులు కాలేయ ప్రక్షాళనగా, హెయిర్ టానిక్‌గా, జుట్టు రాలడం, చుండ్రు, అకాల తెల్లజుట్టు వంటి జుట్టు సమస్యలపై అద్భుతంగా పని చేస్తుంది.
రెండు చుక్కల రసాన్ని ఒక టీ స్పూన్ (5 మి.లీ) తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు ఉపశమిస్తుంది.
గుంటగలగర ఆకులను కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి.
నోరు పొక్కి, కురుపులు ఏర్పడినప్పుడు నాలుగు గుంట గలగర ఆకులను శుభ్రంగా కడిగి నోటిలో ఉంచుకొని చప్పరిస్తే నోటిలో కురుపులు త్వరగా మానిపోతాయి.
గుంటగలగర ఆకులకు తగినంత నీరు కలిపి, నూరి బట్టలో పిండి ఆ రసాన్ని నోటిలో పోసుకొని ఐదు నుండి పదినిమిషాల పాటు పుక్కిలిస్తే నోటి పూత, నాలుకపూత, నాలుకపై పగుళ్ళు, నోటిలో పుండ్లు మొదలైన సమస్యలు తొలగిపోతాయి.
వయసును బట్టి ఐదు నుండి పది గ్రాములు ఆకుల్ని తీసుకొని, కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరి అరకప్పు నీటిలో కలపాలి.
దీన్ని వడబోసి వచ్చిన రసాన్ని ఉదయం, సాయంత్రం రెండుపూటలా భోజనానికి గంటముందు తాగితే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, పేగులలో అలజడి, మలబద్ధకం తగ్గుతాయి.
ఆ మిశ్రమంలోని తేమ ఇగిరిపోయాక నూనెను వడపోయాలి. ఈ గుంటగలగర నూనెను వరుసగా తలకు వాడితే చిన్న వయస్సులో నెరిసిన జుట్టు నల్లబడుతుంది. వెండ్రుకలు రాలిపోవడం ఆగిపోతుంది.
గుంటగలగర మొక్కను వేరుతో సహా సేకరించి మెత్తటి ముద్ద అయ్యేట్లు నూరి పేనుకొరుకుడు గల ప్రదేశాల్లో పూయడం వల్ల ఫలితం ఉంటుంది.
గుంటగలగర వేళ్లు, వేళ్ళ పొడి, ఇంట్లో కొట్టుకున్న పసుపుకొమ్ముల పొడి సమ పాళ్లల్లో కలిపి నిల్వ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని రెండుపూటలా అరచెంచా మోతాదులో తీసుకుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి.