ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒకటి. ఈ పండ్లనే కరాంబోలా అని కూడా పిలుస్తారు.

 లేత పసుపు పచ్చ రంగులో ఉండే స్టార్ ఫ్రూట్. తీపి, పులుపు రుచిని కలిగి ఉంటాయి.

 స్టార్ ఫ్రూట్ లో  విటమిన్ సి, బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.

అయితే ఎన్నో పోషకాలు ఉన్న ఈ స్టార్ ఫ్రూట్స్  తింటే కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

 స్టార్ ఫ్రూట్స్ తీసుకోవడం వలన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి

ఒత్తిడి, డిప్రెషన్, అందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

మధుమేహం రోగులు కూడా ఈ స్టార్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు.

స్టార్ ఫ్రూట్స్ ను డైట్లో చేర్చుకుంటే..బ్లడ్ లో షుగర్ లెవల్స్ అదుపులో ఉండేలా చేస్తాయి.

గర్భిణీ స్త్రీలు ఈ పండ్లను తింటే పుట్టబోయే శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

పాలిచ్చే తల్లులు  ఈ స్టార్ ఫ్రూట్స్ తీసుకుంటే.. పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.

స్టార్ ఫ్రూట్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల, ఇవి తీసుకుంటే మలబద్ధకం సమస్యను నివారించవచ్చు.

ఈ పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.

స్టార్ ఫ్రూట్ను తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

కిడ్నీ సంబంధిత సమస్యలను నివారించడంలోనూ స్టార్ ఫ్రూట్స్ సహాయపడతాయి.

మనం ఆరోగ్యంగా ఉండేందుకు స్టార్ ఫ్రూట్స్ అనేక రకాలు గా ఉపయోపడతాయి.