సాధారణంగా శొంఠి గురించి అందరికీ తెలిసిందే.

అల్లం పొట్టుతీసి సున్నం తేటలో ముంచి ఎండబెట్టి శొంఠిగా మారుస్తారు.

రోజు భోజనం చేసే సమయంలో శొంఠిని మొదటి ముద్దలో పెట్టుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఆహారంతో పాటుగా శొంఠిని తినడం వల్ల జీర్ణం బాగా అవుతుంది.

తరచూ శొంఠిని ఉపయోగించడం వల్ల ఆకలి బాగా అవుతుంది.

బరువు తగ్గాలి అనుకునే వారు వేడి నీటిలో శొంఠి పొడి, తేనెను కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.

జలుబు బాగా ఉన్నప్పుడు.. గోరు వెచ్చని నీటిలో శొంఠి పొడి, మిరాయల పొడి కలుపుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది.

శొంఠి పొడిని తాటిబెల్లంతో కలుపుకుని తీసుకోవడం వల్ల.. మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

తలనొప్పి బాగా ఉన్నప్పుడు శొంఠిని అరగదీశి ఆ చూర్ణాన్ని తలకు రాయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.

వాతం, కఫం, పిత్త దోషాలకు శొంఠి టీ తాగితే మంచిది.

శొంఠి పొడిలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి.

వాతంతో వచ్చే నొప్పులు తగ్గేందుకు శొంఠి, ధనియాలతో చేసిన కషాయం తాగితే మంచిది.

గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించేందుకు శొంఠి బాగా పనిచేస్తుంది.

వాంతులు, అజీర్తి, నులిపురుగుల సమస్యకు కూడా శొంఠి సరైన పరిష్కారాన్ని చూపిస్తుంది.