నెయ్యి.. చాలా మందికి ఇది లేనిదే ముద్ద దిగదు. వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి పడినా ఆ రుచి వేరుంటుంది.

కానీ, డైటింగ్‌లు, ఆరోగ్య సమస్యలు వస్తాయనే భయంతో నెయ్యిని దూరం పెడుతున్నారు

అంతేకాకుండా నెయ్యి తినడం వల్ల బరువు పెరిగిపోతారనే భయం కూడా ఉంది.

అయితే ఆవు నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఉదయాన్ని పరగడుపున 5 నుంచి 10ML నెయ్యిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

నెయ్యిలో మనిషి శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.

తగిన మోతాదులో రోజూ ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

2 టీస్పూన్ల నెయ్యిలో దాదాపు 300 క్యాలరీల శక్తి ఉంటుంది.

నిద్రపోయే ముందు కొంచం నెయ్యిన పాలలో కులుపుకుని తాగితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.

రోజూ ఆవు నెయ్యి తీసుకోవడం వలన నాడీ వ్యవస్థ చురుకవ్వడంతో పాటు కీళ్ల నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంది.

నెయ్యిని తరచూ ఉపయోగించడం ద్వారా క్యాన్సర్‌ దరి చేరదని నిపుణులు సైతం చెబుతున్నారు.

ఎదిగే పిల్లలకు తగిన మోతాదులో నెయ్యి పెట్టడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

అంతేకాకుండా చర్మ వ్యాధులను నివారించడంలోనూ ఆవు నెయ్యి చాలా బాగా పని చేస్తుంది.

రోజూ నెయ్యిని తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

కానీ, మోతాదుకు మించి ఉపయోగిస్తే మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.