కొబ్బరి నీటి ని రాత్రివేళ పడుకునే ముందు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా పరిగణించే కొబ్బరినీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. 

కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీంట్లో ఇన్ బిల్ట్ హైడ్రేటింగ్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

కొబ్బరి నీటిని పడుకునే ముందు తీసుకుంటే.. గుండె సమస్యలకు కారణమయ్యే రక్తపోటును సమర్థంగా కంట్రోల్ చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.  

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.  అందుకే కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాత్రి సమయంలో తీసుకుంటే శరీరానికి,ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. 

రక్తపోటును సహజంగా తగ్గించుకోవాలనుకుంటే రాత్రిపూట కొబ్బరి నీరు తాగటం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

రాత్రి నిద్ర పోయేటప్పుడు కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల తల నొప్పి, కడుపు నొప్పి మొదలైన సమస్యలని తొలగిస్తుంది.

రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీరు తీసుకుంటే బరువు అదుపులో ఉంచుకోవచ్చు.

రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు కొబ్బరి నీరు తీసుకోవటం వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది.

నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు నిద్రకు ముందు కొబ్బరి నీరు తాగటం వల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి తరచుగా కొబ్బరి నీరు తాగడం మంచిది. ఇవి మూత్రం ద్వారా శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. శరీరం డీహైడ్రేషన్ కానివ్వదు.. 

అధిక వేడి శరీర తత్త్వం ఉన్న వాళ్ళు రాత్రి పడుకునే ముందు కొబ్బరినీళ్లను తాగడం మంచిది.