ఇది డయాబెటిస్ ని నివారిస్తుంది. బ్లాక్ రైస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని చక్కెర స్థాయిని బ్యాలన్స్ చేస్తుంది.
రక్తంలోని గ్లూకోజ్ ను నెమ్మదిగా విడుదల చేయడంలో దోహదపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి సడన్ గా పెరగడాన్ని నివారిస్తుంది.
అరకప్పు బ్లాక్ రైస్ లో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే పేగు కదలికలు సక్రమంగా జరుగుతాయి.
బ్లాక్ రైస్ లో లుటిన్, జియాక్సంతిన్లు కంటి ఆరోగ్యానికి సంబంధించిన 2 రకాల కెరోటినాయిడ్స్. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పని చేస్తాయి.
బ్లాక్ రైస్ లో ఉండే కెరోటినాయిడ్స్, విటమిన్ ఇ కళ్లపై మూవీ రేడియేషన్ ను తగ్గిస్తాయి.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం మాత్రమే. నిపుణుల సూచనలను అనుసరించి నిర్ణయం తీసుకోవాలని మనవి.