ఉదయాన్నే చన్నీటి స్నానం చేయడం వల్ల ఒక నూతన ఉత్తేజాన్ని పొందుతారు.

బద్ధకం, నిద్రలేమితనం వదిలించుకోవడానికి చన్నీటి స్నానం ఉపయోగపడుతుంది.

డిప్రెషన్‌ని తగ్గించడంలో చన్నీటి స్నానం బాగా దోహదపడుతుంది.

చన్నీటి స్నానం చేసినప్పుడు డిప్రెషన్‌ని తరిమికొట్టే నార్‌-అడ్రెనలిన్, బేటా-ఎండోర్ఫిన్స్‌ వంటి కెమికల్స్‌ ఎక్కువగా రిలీజ్‌ అవుతాయి.

పురుషుల్లో పునరుత్పత్తి స్థాయిని పెంచుతుంది. అలానే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ను ఉత్తేజపరిచి శృంగార కోరికలను పెంచడంలో సహాయపడుతుంది.

చన్నీటి స్నానం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

చన్నీటి స్నానం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. 

తల మీద నుండి చన్నీళ్ళు పోసుకున్నప్పుడు ఊపిరి ఆడదన్న భావన కలుగుతుంది.

అయితే తల మీద చన్నీళ్ళు పోసుకున్నప్పుడు ఊపిరి బిగపెట్టి, తర్వాత నెమ్మదిగా వదులుతారు.

అలా చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

శరీరం మీద వచ్చే దురదలు చన్నీటి స్నానం చేయడం వల్ల తగ్గుతాయి.

చన్నీటి స్నానం వల్ల కండరాల నొప్పి తగ్గడమే కాక.. శరీర బరువును తగ్గేందుకు దోహదపడుతుంది.

జుట్టు మరియు శరీరం మెరవడానికి చన్నీటి స్నానం దోహదపడుతుంది.

చన్నీళ్ళు శరీరం మీద పడగానే శరీరం ఒక షాక్‌కి గురవుతుంది.

ఈ షాక్ ఆక్సిజన్ తీసుకోవడాన్ని, గుండె వేగాన్ని, అప్రమత్తతను పెంచుతుంది.

చన్నీటి స్నానం వల్ల శరీర ఉష్ణోగ్రతకు తగ్గట్టు రక్త ప్రసరణను పెరుగుతుంది.