తల్లి పాలలో టాక్సిన్స్‌తో పోరాడే శక్తి ఉంటుంది. తల్లి పాలు తాగే బిడ్డకు జలుబు, సైనస్, చెవి ఇన్ఫెక్షన్, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు తక్కువ.

బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. గుండె సమస్య, రొమ్ము  అండాశయ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. 

తల్లిపాలు ఇచ్చే సమయంలో ప్రోలాక్టిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇది గర్భాశయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

తల్లి పాలివ్వని బిడ్డల్లో అధిక బరువు, ఊబకాయం, కౌమారదశలో సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు తెలుపుతున్నారు.

తల్లి పాలు శిశువు పెరుగుదలకు తోడ్పడతాయి. వీటిలో సరైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వులను కలిగి ఉంటుంది. శిశువు ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహించడానికి ఇవి సహాయపడుతాయి.

తల్లి పాలలో లభించే ప్రతిరోధకాలు, ఎంజైములు మరియు హార్మోన్లు నవజాత శిశువులకు మంచి ఆహారాన్ని అందిస్తాయి.

కొన్ని అధ్యయనాలు ప్రకారం కనీసం 4 నెలల పాటు తల్లిపాలు తాగిన పిల్లల్లో తామర, ఉబ్బసం, ఆహార అలెర్జీల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పైగా ఇది పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని కూడా అంటారు.

ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువును బాధించే SIDS సమస్యను నివారించవచ్చు. ఈ సమస్య ఉన్న పిల్లవాడు అకస్మాత్తుగా చనిపోయే అవకాశం ఉంది. 

మంచి నిద్రను ప్రోత్సహించే తల్లి పాలు, SIDS ప్రమాదాన్ని 50% తగ్గిస్తుంది.

తల్లి పాలు పిల్లల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చు. తల్లిపాలను హాడ్కిన్స్ వ్యాధి,  లింఫోబ్లాస్టిక్ లుకేమియా వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది.

బిడ్డకు పాలు పట్టడం వల్ల తల్లి శరీరంలోని అధిక కొవ్వును గణనీయంగా తగ్గిస్తుంది. 

తల్లికి సాధారణంగా రోజుకు 400-500 కేలరీలు అవసరం. తల్లి పాలివ్వడం వల్ల 500 కేలరీలు తగ్గుతాయని చెబుతారు.