ఆవనూనె గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు.

ఆవనూనె మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా చలి కాలంలో ఆవనూనెతో బాడీ మసాజ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఆవనూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. 

ఆవనూనెలోఒమేగా 3,6 ఫ్యాటీ యాసిడ్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. 

ఆవనూనెతో బాడీ మసాజ్ చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. 

ఆవనూనెతో మసాజ్ చేసుకుంటే చలికాలంలో చలిని తట్టుకునే శక్తి లభిస్తుంది. 

ఆవనూనె శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

కండరాలు, కీళ్లకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి కూడా ఆవనూనె ఉపయోగపడుతుంది.

పిల్లల నుండి వృద్ధుల వరకు ఎముకలను బలంగా ఉంచడానికి ఆవనూనెను ఉపయోగించవచ్చు.

ఆవనూనెను ఉపయోగించడం వలన మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. 

ఆవనూనెతో శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి.

ఆవనూనెతో మసాజ్ చేసే ముందు కొంచెం వేడి చేయాలి.

అవసరమైతే ఈ నూనెలో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేడి చేయండి. 

ఆవ నూనె బాగా వేడి అయిన తర్వాత  గొరు వెచ్చగా మారే వరకు చల్లారనివ్వండి. 

గోరు వెచ్చగా ఉన్న నూనెతో మొత్తం శరీరాన్ని బాగా మసాజ్ చేయండి. 

అయితే ఈ మసాజ్ ఉదయం పూట చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.