మనం వివిధ రకాల ఆహార పదార్ధాలలు చక్కగా పొంగి,రుచిగా ఉండేందుకు వంట సోడా ను ఉపయోగిస్తాం
వంటల్లోనే కాకుండా వివిధ ఆరోగ్య సమస్య నివారణకు కూడా బేకింగ్ సోడాను ఉపయోగిస్తుంటారు.
బేకింగ్ సోడాతో వివిధ రకాల చర్మ, దంత సంబంధమైన సమస్యలను తగ్గించుకోవచ్చు.
బేకింగ్ సోడాతో చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి చర్మం నిగారిస్తుంది.
బేకింగ్ సోడాతో దంతాలను శుభ్రం చేయడం వల్ల వాటిపై ఉండే పసుపుదనం పోతుంది.
మూత్ర పిండాలలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి బేకింగ్ సోడ సాయపడుతుంది.
గ్లాసు నీటిలో ఈ సోడాను కలిపి రోజూ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది
గోళ్లకి ఫంగస్ ఇన్ ఫెక్షన్ వచ్చినప్పుడు నిమ్మరసంతో కలిపి బేకింగ్ సోడాను ఉపయోగిస్తే తగ్గుతుంది.
కీటకాలు కుట్టిన చోట బేకింగ్ సోడాను పేస్ట్ లా చేసి రాయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.
నీళ్లలో బేకింగ్ సోడాను కలిపి మొక్కలపై చల్లడం వల్ల మొక్కలకు పట్టిన చీడ తొలగిపోతుంది.
బేకింగ్ సోడాతో ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి ఇది అధిక గాఢతను కలిగి ఉంటుంది.
కనుక దీనిని తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.