బాదం నూనె మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి, జుట్టుకు ఎంతో ప్రయోజనకరం. దీనిలో పొటాషియం, మోనో శాచురేటెడ్, జింక్, విటమిన్ ఎ, బి, ఇ, డి పుష్కలంగా ఉంటాయి.
బాదం నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎన్నో హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మన జుట్టును మృదువుగా, మెరిసేలా ఇది చేస్తుంది.
దీనిలో ఉండే విటమిన్ ఇ, ప్రోటీన్లు, పొటాషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జింక్ వంటి పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి.
బాదం నూనెలో జుట్టును హైడ్రేట్ చేసే పోషణ లక్షణాల ఉంటాయి. దీనిని రెగ్యులర్ గా జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ హెయిర్ స్మూత్ గా, తక్కువ జిడ్డుగా మారుతుంది.
అసలు బాదం నూనెను పెట్టడం వల్ల ఇవే కాదు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హెయిర్ ప్రొడక్ట్స్ లో ఉండే రసాయనాలు, కాలుష్య కారకాలు, వేడి, దుమ్ము, దూళి జుట్టును బాగా దెబ్బతీస్తాయి. అలాగే సంక్రమణ, మంటకు దారితీస్తాయి.
దీనివల్ల చుండ్రు, జుట్టు రాలడం, బలహీనమైన జుట్టు వంటి జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
అయితే జుట్టుకు బాదం నూనెని అప్లై చేయడం వల్ల మంట తగ్గుతుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్లీరియల్ లక్షణాలు ఉంటాయి.
పోషకాల లోపం, డ్రై హెయిర్ లాంటి కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది. అలాగే తెగిపోతుంది. బాదం నూనె నెత్తిమీద మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. చుండ్రుని పోగొడుతుంది.
బాదం నూనెలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎంతో సహాయపడతాయి. జుట్టు సన్నబడటాన్ని తగ్గిస్తాయి.
బాదం నూనెలో కొవ్వు ఆమ్లాలు ఎక్కువ. ఇవి మీ జుట్టుకు అవసరమైన ఆర్ధీకరణను అందిస్తాయి. ఈ ఆయిల్ నెత్తిమీద, జుట్టు మూలాలను తేమగా చేస్తాయి. మీ హెయిర్ మృదువుగా, అందంగా మెరుస్తుంది.
పలు అధ్యయనాల ప్రకారం.. బాదం నూనెలో ఉండే లినోలెయిక్ ఆమ్లం, ఒలెయిక్ ఆమ్లం మీ జుట్టును బలోపేతం చేస్తాయి. విటమిన్ ఇ, బి7 లు ఉండే నూనె, బాదం నూనె రక్తప్రసరణను పెంచుతుంది.
దీంతో మీ జుట్టు మూలాల నుంచి మరమ్మత్తు చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా మీ జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి.
జుట్టు ఒత్తుగా, బలంగా పెరిగేందుకు సహాయపడే నూనెల్లో బాదం నూనె ముందుంటుంది. బాదం నూనెలో విటమిన్ ఇ అనే సహజ యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది.
ఇది పర్యావరణ కాలుష్యం ప్రభావం నుంచి జుట్టును రక్షిస్తుంది. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. జుట్టు ఊడటం ఆగి, వేగంగా పెరుగుతుంది.
గడ్డాన్ని ఒత్తుగా పెంచాలనుకునే వారికి బాదం నూనె బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని ప్రోటీన్లు, మెగ్నీషియం, బయోటిన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఇవి గడ్డం జుట్టును వేగంగా, ఒత్తుగా పెంచేందుకు సహాయపడతాయి. పొడి జట్టు సమస్యను పోగొడతాయి. రంధ్రాలకు అడ్డుపడే మృత కణాలను తొలగించడానికి ఈ నూనె సహాయపడుతుంది.
పొడి చర్మం, జుట్టు క్లీన్ గా లేకపోవడం, కొన్ని రకాల షాంపూలు, నెత్తిమీద సోరియాసిస్, తామర, ఈస్ట్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి కారణాల వల్ల నెత్తిపై చుండ్రు ఏర్పడుతుంది.
నెత్తిమీద చుండ్రు పేరుకుపోతే నెత్తికి ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. దీనివల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. అయితే బాదం నూనెను జుట్టు రాయడం వల్ల చుండ్రు తగ్గుతుంది.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోవడం ఉత్తమం.