ఈ సమాజంలో మంచి మనుసుతో ఆలోచించేవాళ్లు చాలా మందే ఉంటారు. 

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ మేమున్నామంటూ భరోసా ఇస్తుంటారు.

 అప్పుడప్పుడు మన ఇంటికి బిక్షగాళ్లు వచ్చినప్పుడు డబ్బులు, వస్తువులు ఇలా ఏది తోచితే అది దానం చేస్తుంటాం.

 కానీ, అలాంటి వస్తువులు దానం చేస్తే మాత్రం దరిద్రం ఎప్పుడూ మీ వెంటే ఉంటుందని కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అసలు ఎలాంటి వస్తువులు దానం చేయకూడదు? చేస్తే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఇంట్లో ఉండే సూదులు, చాకులు, కత్తులు ఎవరికీ దానం చేయకూడదట. అలా చేయడం వల్ల నష్టాలు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇంట్లో పాడైపోయిన వస్తువులను దానం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వారికి అస్సలు కొబ్బరి నూనే ఇవ్వకూడదట.

ఎందుకంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మి దేవి వారితో వెళ్తుందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మన ఇంట్లో వాడే చిపురును కూడా ఎవరికీ దానం చేయకూడదట. చీపురు లక్ష్మి దేవితో సమానం, దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.

ఇలా ఏది పడితే అది దానం చేయడం వల్ల లేని పోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు.

ఇక నుంచైనా కాస్త ఆలోచించి దానం చేయాలని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.