ఇటీవల టీమిండియా టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వైదొలిగిన తర్వాత..

కోహ్లీ రెగ్యులర్ కెప్టెన్సీ పై అనుమానాలు మొదలైపోయాయి.

 కోహ్లీ ప్రస్తుతం కోహ్లీ వన్డే, టెస్టు ఫార్మాట్ లకు మాత్రమే కెప్టెన్ గా కొనసాగుతుండగా..

తాజాగా కోహ్లీని టెస్టు ఫార్మాట్ కు మాత్రమే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ది వాల్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ అయినప్పటి నుండి వన్డే కెప్టెన్సీ రోహిత్ శర్మకు అప్పగించాలని ఆలోచిస్తున్నాడట.

టీ20లో న్యూజిలాండ్ పై భారత్ కు విజయం అందించిన రోహిత్ కే ఓటు వేస్తున్నాడట ద్రావిడ్.

మరికొద్ది రోజుల్లో సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియాకు వన్డే కెప్టెన్ గా కోహ్లీనే బాధ్యత వహించనున్నాడు. 

అయితే ఈ పర్యటన అనంతరమే రోహిత్ కు వన్డే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని ప్రిపేర్ చేస్తుందట టీమ్ మేనేజ్మెంట్. 

 రానున్న 2023 వరల్డ్ కప్ లోపు రోహిత్ ను వన్డే కెప్టెన్ చేయడమే ఉత్తమైన మార్గమని బీసీసీఐ బాస్ గంగూలీ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

నిజానికి ఈ ఏడాది జరిగే వన్డే ఫార్మాట్ అంతగా ఇంపార్టెంట్ కాదట. అతి తక్కువ మ్యాచ్ లు ఉండటంతో..

ఒకవేళ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు సారధిగా రోహిత్ శర్మనే ఎంపిక చేస్తే 2023 వరల్డ్ కప్ వరకు అతను టీం తయారు చేసుకునే పనిలో ఉంటాడని నిపుణులు చెప్తున్నారు.

నిజానికి ఈ విషయంలో కోహ్లీకి కూడా క్లారిటీ ఉందని, తన వన్డే కెప్టెన్సీ కూడా ఎక్కువ కాలం సాగాడని కోహ్లీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడట.

ఇప్పటికే కోహ్లీ ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. 

దీంతో.., ఈ వ్యవహారాన్ని ఇంకా తేల్చకపోతే ఆటగాళ్లలో అనవసర టెన్షన్ పెరిగే ప్రమాదం ఉందని ద్రావిడ్ భవిస్తున్నారట.

 ఇందుకే.. సౌత్ ఆఫ్రికా పర్యటనే వన్డే కెప్టెన్ గా కోహ్లీకి చివరిదని, ఆ తరువాత పగ్గాలు రోహిత్ చేతికి రావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

మరి.. వన్డే కెప్టెన్ గా రోహిత్ ని నియమిస్తే బాగుంటుందా? కోహ్లీని కొనసాగిస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.