అరటిపండు, ఆపిల్ పండు.. రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే వీటిలో దేన్ని తింటే మంచిదన్న మధుమేహులకి ఉంటుంది.

ఆపిల్ పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆపిల్ లో ఉండే ఫైబర్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల ఆకలి వేయదు, అతిగా తినరు.

కాబట్టి భారీగా బరువు పెరిగే అవకాశం ఉండదు. ఫిట్ గా కూడా ఉంటారు. 

ఆపిల్స్ లో ఉండే విటమిన్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అలానే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందించేందుకు ఆపిల్స్ సహాయపడతాయి. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

ఇక అరటిపండులో ఫైబర్ తో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువే ఉంటాయి.

అరటిపండ్లు తినడం వల్ల పేగులకు మేలు చేసే బ్యాక్టీరియాలకు మద్దతు లభిస్తుంది. దీని వల్ల మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది.

అరటిలో ఉండే పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి.

అలాగే అరటిపండులో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. అరటి పండు తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం తక్కువ.

బరువు పెరగాలి అనుకునే సైజ్ జీరో అబ్బాయిలు అరటి పండ్లు ఎక్కువ తింటే మంచి ఫలితాలు ఉంటాయి. అలానే అరటి పండు చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది.

అరటిలో కంటే ఆపిల్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఆపిల్స్ తింటే మంచిది.

మధుమేహం ఉన్నవారు అరటిపండ్లు కంటే ఆపిల్స్ తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.