IPLలో కల్ట్ క్రేజ్ ఉన్న జట్లలో మిగతావి ఏమోకానీ చెన్నై సూపర్ కింగ్స్ టాప్ లో ఉంటుంది.

ఫస్ట్ సీజన్ నుంచి కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ.. మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టుగా దీన్ని మార్చాడు.

2020 మినహా దాదాపు ప్రతి సీజన్ లో చెన్నై జట్టు క్వాలిఫయర్స్ లో అడుగుపెడుతూ వచ్చింది.

అయితే 2015లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు వచ్చాయి.

దీంతో 2016, 17.. ఇలా రెండేళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ తోపాటు రాజస్థాన్ పై నిషేధం విధించారు.

ఇక నిషేధం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ధోనీసేన.. వెంటనే కప్ కొట్టి తమ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.

2021లోనూ కప్ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్.. గతేడాది మాత్రం నామమాత్ర ప్రదర్శన చేసి పర్వాలేదనిపించింది.

ప్రస్తుత సీజన్ తీసుకుంటే తొలి మ్యాచ్ ఓడినప్పటికీ.. ఆ తర్వాత వరసగా రెండింటిలో విజయం సాధించింది.

అంతా బాగానే ఉంది. ధోనీ నేతృత్వంలో ఈసారి కూడా ఫేవరెట్ గా ఆడుతున్నట్లు కనిపిస్తుంది.

ఇలా అంతా సరిగానే ఉన్న టైంలో చెన్నై సూపర్ కింగ్స్ ని బ్యాన్ అనే న్యూస్ రావడంతో ఫ్యాన్స్ షాకయ్యారు.

తాజాగా తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పీఎంకే ఎమ్మెల్యే ఈ డిమాండ్ చేశారు.

తమిళనాడు నుంచి ఒక్క ఆటగాడు చెన్నై జట్టులో లేడని, మరి ఈ టీమ్ ఎందుకని MLA SP వెంకటేశ్వరన్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో చాలామంది ప్రతిభావంతులు ఉన్నప్పటికీ, IPLలో ఆడే ఛాన్స్ ఇవ్వట్లేదని సదరు ఎమ్మెల్యే మండిపడ్డారు.

తమిళనాడు క్రీడాశాఖ దీనిపై స్పందించట్లేదని, చెన్నై జట్టు IPLతో వ్యాపారం చేస్తోందని ఈయన నిరసన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ  విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని పీఎంకే పార్టీ మిగతా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో సెటైర్స్ కూడా పేలుతున్నాయి.

ఇలా చూసుకుంటే.. చెన్నై మాత్రమే కాదు IPLలో చాలా జట్లలో ఆయా రాష్ట్రాలు ఆటగాళ్లు లేరు కదా అని నెటిజన్స్ అంటున్నారు.

దీనిబట్టి చూసుకుంటే.. తమిళనాడు MLA వ్యాఖ్యలు చెన్నై టీమ్ పై ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చు అనిపిస్తోంది.

మరి సొంత ఆటగాళ్లు లేరని.. చెన్నై జట్టుని బ్యాన్ చేయాలని MLA అనడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.