ఇటీవల తెలుగులో టాక్ షోలు బాగా పాపులర్ అవుతున్నాయి. వెండితెరపై స్టార్లుగా వెలిగిపోతున్న హీరోలు, హీరోయిన్లు ఇలాంటి టాక్ షోలను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు తమ హోస్టింగ్తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. 

 ఇదే బాటలో ఎన్టీఆర్, నాని, రానా లాంటి ఈ జెనరేషన్ హీరోలు కూడా హోస్ట్లుగా వ్యవహరించారు. ఇతర రియాల్టీ షోల్లో మరికొంత మంది నటీనటులు తమ సత్తా చాటుతున్నారు.

ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా ఓటీటీ ఆహా టాక్ షో తో సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు.

ఆహా యాప్ ద్వారా ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షో లాంచ్ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నవంబర్ 4 నుంచి ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి ఎవరు రానున్నారు అనే విషయంపై ఎంతో ఆతృత నెలకొంది.

ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో సెన్సేషనల్ టాక్ నడుస్తుంది.

‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో లో హూస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్యకి ఒక ఎపిసోడ్ కి ఏకంగా రూ.40 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

మొత్తం 12 ఎపిసోడ్స్ గా దీన్ని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

అంటే దాదాపు రూ.5 కోట్లు రెమ్యునరేషన్ దక్కుతుందని లెక్కలేస్తున్నారు.

ఇక నందమూరి అభిమానులు బాలయ్యా.. మజాకా అంటూ ఏది చేసినా సెన్సేషన్ అంటూ తెగ సంబరపడిపోతున్నారు.

మరోవైపు బాలయ్య రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్గా మారింది.