టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ పార్థివ దేహానికి బాలకృష్ణ నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.

బుధవారం ఉదయం భార్య వసుంధర, కూతురు నారా బ్రాహ్మిణితో కలిసి బాలయ్య పద్మాలయ స్డూడియోస్‌కు వెళ్లారు.

అక్కడ కృష్ణ కుటుంబసభ్యులను బాలయ్య కుటుంబసభ్యులు పరామర్శించారు.

బాలయ్య మహేష్‌ బాబుకు ధైర్యం చెప్పి ఓదార్చారు.

దాదాపు 10 నిమిషాలకు పైనే కృష్ణ కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

కృష్ణ మరణంతో ఏడుస్తున్న మహేష్‌, గౌతమ్‌లను బాలకృష్ణ నవ్వించారు.

ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ, మహేష్‌ల మధ్య చక్కటి సంభాషణ జరిగింది.