కడప జిల్లా బద్వేలు
అసెంబ్లీ నియోజకవర్గానికి
జరగనున్న బై పోల్ ప్రచారానికి
తెర పడింది.
ఈ నెల 30న బద్వేలు
ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.
నవంబరు 2న ఓట్ల లెక్కింపు
చేపడతారు. ఆ రోజే రిజల్ట్ తేలనుంది.
2019 ఎన్నికల్లో బద్వేల్
నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి
గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య
అకాల మరణంతో నియోజకవర్గంలో
ఉప ఎన్నిక వచ్చింది.
బద్వేల్ లో టీడీపీ జనసేనలు పోటీ
పనుండి వెనక్కి తగ్గారు. బీజేపీ కాంగ్రెస్
అభ్యర్థులు మాత్రం పోటీలో నిల్చున్నారు.
బద్వేల్ ఉప ఎన్నికల్లో
రూలింగ్ పార్టీ వైసీపీ ప్రచారంలో
దూసుకుపోయింది. వైసీపీ తరపున రెండు
రోజులుగా స్టార్ క్యాంపెయిన్ గా ఎమ్మెల్యే రోజా
ప్రచారం నిర్వహించారు.
బీజేపీ మాత్రం ప్రెస్ మీట్
లకే పరిమితమైంది. కాంగ్రెస్ అడ్రెస్
లేదు.ఎక్కడా సరిగ్గా ప్రచారం కూడా
చేయలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బద్వేల్ ఉప ఎన్నిక కోసం
272 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
ఇందులో 30 పోలింగ్ కేంద్రాలు
సున్నితమైనవిగా గుర్తించారు.
బద్వేలు నియోజకవర్గంలోని
ఎమ్మెల్యేలు మకాం వేసి వైసీపీ గెలుపు
ఏడు మండలాల్లో వైసీపీ మంత్రులు
కోసం కష్టపడ్డారు.
తమ పార్టీ ఇక్కడ కూడా
విజయం సాధిస్తే.. సీఎం జగన్ అమలు
చేసే పథకాలకు రెఫరెండమ్ గా భావించాలని
వైసీపీ నేతలు సవాలు చేస్తున్నారు.
టీడీపీ, జనసేన అంతర్గతంగా
బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో
మాత్రం ఆ పార్టీకి అంతగా పట్టులేకపోవడం
వైసీపీకి కలసి వస్తోంది.
ఈ ఉప ఎన్నిక కోసం వైసీపీ
అధినేత జగన్ మోహన్ రెడ్డి కనీసం
ప్రచారానికి కూడా రాకపోవడం విశేషం.
2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ
అభ్యర్ధికి ఇక్కడ 45 వేల ఓట్ల మెజారిటీ
లభించింది.
ఇప్పుడు సానుభూతి ఓట్లు,
జగన్ అమలు చేస్తున్న పధకాల
ప్రభావంతో మెజారిటీ లక్ష దాటుతుందని
వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరి.. బద్వేల్ ఉప ఎన్నికలో
ఏ పార్టీకి ఎంత మెజారిటీతో విజయం
లభిస్తుందో చూడాలి.