ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న వారంతా ఒకప్పుడు సామాన్యులే. వారు సామాన్యులుగా ఉన్న దశలో అవమానాలు ఎదుర్కునే ఉంటారు.
ఆడవారినైతే ఇబ్బందులు పెట్టడం, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి చేసే ఉంటారు.
అయితే అప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు గతాన్ని తలచుకుని బాధపడుతుంటారు.
తాజాగా గాజువాక కండక్టర్ ఝాన్సీ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవం గురించి ప్రస్తావించారు.
గాజువాక కండక్టర్ ఝాన్సీ గురించి పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన కండక్టర్ కమ్ డ్యాన్సర్.
పల్సర్ బైక్ సాంగ్ తో క్రేజ్ సంపాదించుకున్న ఝాన్సీ.. ఇవాళ ఇంత స్టార్ స్టేటస్ అనుభవిస్తుందంటే దాని వెనుక ఎన్నో బాధలు ఉన్నాయని ఆమె అన్నారు.
ఒకసారి టైలర్ తన విషయంలో తప్పుగా ప్రవర్తించాడని ఆమె అన్నారు.
పల్సర్ బైక్ సాంగ్ ద్వారా ఫేమస్ అయిన ఝాన్సీ.. పలు టీవీ షోస్ లో డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు.
సూపర్ క్వీన్ సీజన్ 2 షోలో పాల్గొన్న ఝాన్సీ.. తాను ఓవర్ నైట్ స్టార్ అయిపోలేదని.. దాని వెనుక 18 ఏళ్ల కష్టం ఉందని అన్నారు.
దుస్తులు కొలిచే కొలతల్లో తప్పుగా ప్రవర్తించాడని ఆమె అన్నారు.
ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పి టైలర్ ను కొట్టిద్దామని అనుకున్నారు ఝాన్సీ.
అయితే ఊహించని విధంగా ఝాన్సీని తన తండ్రి.. నేను నీ తండ్రిని కాదని చెప్పమన్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ షో ఏప్రిల్ 9న ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే ఈ షోకి అతిథిగా కాజల్ అగర్వాల్ రావడం విశేషం.