టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది.
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో గా ఉన్న నాగ
శౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
ఈ నవంబరు 20న 11.25 గంటలకు వివాహ బంధంతో ఓ నూతన అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడ
ు.
నాగశౌర్య వివాహం బెంగళూరులోని ఓ హోటల్‌లో జరగనుంది.
ఇప్పటికే నాగశౌర్య ఫ్యామిలీ పెళ్లి పనులు కూడా ప్రారంభించేశారు.
నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్న అనూష శెట్టి ఎవరో, ఆమె వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనూష శెట్టి కర్ణాటకు రాష్ట్రంలోని మంగళూరు సమీపంలోని కుందాపూర్ కు చెందిన అమ్మాయి.
అనూష శెట్టి ఒక ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఉమెన్ అచీవర్స్ లో ఒకరిగా గుర్తింపు కూడా స
ంపాదించుకున్నారు.
ఆమె 2019-20 సంవత్సరానికి బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నార
ు.
అనూష శెట్టికి బెంగళూరులో అనూష శెట్టి డిజైన్స్ అనే ఒక సంస్థ కూడా ఉంది.
అనూష శెట్టికి ఇంటీరియర్ డిజైనింగ్ లో మంచి పేరుంది.
ఎంతో లగ్జరీ రెసిడెన్షియల్ ఇంటీరియర్ డిజైన్ చేయడంలో ఆమె ప్రత్యేకం.
డిజైన్ అనేది కనిపించేదే కాదు.. అది ఎలా పనిచేస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుందని చెబుతుం
టారు.
ఎలాంటి కట్టడాన్ని అయినా తాము అద్భుతమైన భవంతిలా మార్చేస్తామంటూ ఆమె చెప్పేవారు.
నాగశౌర్యకు పెళ్లి ఫిక్స్ అవడంపై టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఫ్యాన్స్ వరకు అంతా శ
ుభాకాంక్షలు చెబుతున్నారు.
నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ అతని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.