ప్రముఖ బహు భాషా నటుడు బబ్లూ పృథ్వీరాజ్ తన కంటే వయసులో 20 ఏళ్లు చిన్నదైనా తెలుగమ్మాయితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
వీరి ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా పుకార్లకు చెక్ పెడుతూ పృథ్వీరాజ్ తన ప్రియురాలు శీతల్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చారు.
ఓ ప్రముఖ తమిళ ఛానల్‌కు మొదటిసారి జంటగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరూ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
ఆమెను కలవటం, తన భార్యతో విడాకులు రావటం.. తమ ఇద్దరి మధ్యా ఓ అండర్‌స్టాండింగ్ ఏర్పడటం సడెన్‌గా జరిగిపోయిందని పృథ్వీరాజ్ తెలిపారు.
అలాంటి టైంలో తమ రిలేషన్ గురించి వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయని చెప్పారు.
ముసలివాడు.. యువతి అంటూ కామెంట్లు చేస్తున్నారన్నారు.
‘ ఈ వయసులో మీ కూతురు వయసున్న పిల్లతో పెళ్లా.. సిగ్గుగా లేదా’ అని ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శీతల్ సడెన్‌గా తన జీవితంలోకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
వైవాహిక ఇబ్బందుల సమయంలో తన మనసులో భావాలను పంచుకోవటానికి ఎవరూ లేరని బాధపడ్డానని, ఆ టైంలో శీతల్ తన జీవితంలోకి వచ్చిందని వెల్లడించారు.
అనంతరం యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బోల్డ్‌గా సమాధానం ఇచ్చారు.
‘‘ మీకు అమ్మాయిల సుఖం కావాల్సి వచ్చిందా?’’ అని అడగ్గా..
దానికి బబ్లూ పృథ్వీరాజ్ ‘‘అవును! అమ్మాయిల సుఖం కావాలి. నన్ను చూడండి. నాకు ప్రతిరోజు పడక సుఖం కావాలి’’ అంటూ వ్యంగ్యత్వం నిండిన బోల్డ్ సమాధానం ఇచ్చారు.
దీంతో యాంకర్ కూడా అదోలా చూస్తూ నవ్వు ముఖం పెట్టింది.