మారుతున్న జీవన శైలి, మారుతున్న అలవాట్ల కారణంగా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి.

ఇక ఈ మధ్య కాలంలో బ్రెయిన్ ట్యూమర్స్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

ఈ ట్యూమర్ కేవలం బ్రెయిన్ లోనే కాక, శరీరంలో అనేక చోట్ల వచ్చే అవకాశం ఉంది.

ఇలాంటి ట్యూమర్స్ వంశపారంపర్యంగా లేదా.. అయోనైజింగ్ రేడియేషన్ ఎక్స్ పోజర్ కారణంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అదీకాక మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు.

మరి ట్యూమర్ కు కారణం అయ్యే ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంది.

కొవ్వు పదార్థాలను ఎక్కువగా తినడం, స్మోకింగ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ట్యూమర్ ముప్పు పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

పురుగు మందులు, ఇండస్ట్రీయల్ ప్రాంతాలలో పనిచేసే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఇక ఎక్కువ రోజులు హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చికిత్స తీసుకునే వారిలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

అందుకే పైన తెలిపిన అలవాట్లు మీకేమైనా ఉంటే వెంటనే వాటిని మానేయడం మంచిది.

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు డాక్టర్లను, నిపుణులను సంప్రదించండి.