ఈతరం చూసిన అద్భుతమైన మూవీ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరాన్ ఒకరు.
‘టైటానిక్’, ‘టెర్మినేటర్’ సిరీస్ చిత్రాలతో కామెరాన్ వరల్డ్ వైడ్‌గా ఫుల్ పాపులారిటీ సంపాదించారు.
ఒక ప్రాజెక్టుపై ఏళ్ల కొద్దీ సమయం వెచ్చించే కామెరూన్‌ను హాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా చెబుతుంటారు.
అంత టైమ్ తీసుకుంటారు కాబట్టే ఆయన తీసే ప్రతి సినిమా సమ్‌థింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది.
జేమ్స్ కామెరాన్ మూవీస్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ అంటే ‘అవతార్’ అనే చెప్పాలి.
2009లో వచ్చిన ‘అవతార్’ మూవీ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.
పండోరా గ్రహంలోని వింతలు, విశేషాలు.. మనుషులకు అక్కడి తెగకు మధ్య జరిగే ఫైట్స్ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురిచేశాయి.
‘అవతార్’ సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తూ వచ్చారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది డిసెంబర్ లో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్ ’ను థియేటర్లలో రిలీజ్ చేశారు కామెరాన్.
‘అవతార్’ తొలి పార్ట్‌లాగే సీక్వెల్ కూడా ప్రేక్షకుల నుంచి విశేషాదరణను పొందింది. తెలుగులోనూ అనువాదమైన ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది.
అలాంటి ‘అవతార్-2’ మూవీ ఇన్నాళ్లూ రెంట్ ప్రాతిపదికన పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేసింది.
అయితే ఈ చిత్రం ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
హాట్‌స్టార్‌లో రెంట్ చెల్లించకుండానే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ను చూసేయొచ్చు.
‘అవతార్-2’ను జూన్ 7న తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంచనున్నట్లు సోషల్ మీడియా వేదికగా హాట్‌స్టార్ ప్రకటించింది.
రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం హాట్‌స్టార్ వెల్లడించలేదు.